భూమిక మృతదేహం అప్పగింతకు నిరాకరణ
ABN , Publish Date - May 26 , 2025 | 05:11 AM
అబూజ్‌మడ్ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మవోయిస్టు భూమిక అలియాస్ వన్నాడ విజయలక్ష్మి (38)మృతదేహాన్ని అప్పగించేందుకు ఆ రాష్ట్ర పోలీసులు నిరాకరించారు.
నారాయణపూర్ ఆస్పత్రికి వెళ్లిన ఆమె తండ్రి, బంధువులు
కేశంపేట, మే 25 (ఆంధ్రజ్యోతి): అబూజ్‌మడ్ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మవోయిస్టు భూమిక అలియాస్ వన్నాడ విజయలక్ష్మి (38)మృతదేహాన్ని అప్పగించేందుకు ఆ రాష్ట్ర పోలీసులు నిరాకరించారు. ఆదివారం భూమిక తండ్రి వన్నాడ సాయిలుతో పాటు సమీప బంధువులు ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లా ఆస్పత్రికి వెళ్లారు.
అయితే భూమిక మృతదేహం అప్పగింతపై ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పోలీసులు చెప్పారని వారు తెలిపారు. మృతదేహాన్ని సోమవారం అప్పగిస్తారని భావిస్తున్నామని చెప్పారు.