Share News

Crime News: యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి..

ABN , Publish Date - May 26 , 2025 | 10:34 AM

Crime News: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో పలువురు మరణించగా, మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద ఘటనల వివరాలు.. హైదరాబాద్‌లో హర్షవర్ధన్ అనే యువకుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. ఆదివారం రాత్రి ఓ పబ్‌లో ఫ్రండ్స్‌తో కలిసి మందు పార్టీ చేసుకున్నారు. అపార్టుమెంట్‌కు చేరుకున్న తర్వాత మళ్లీ మద్యం సేవించారు.తర్వాత ఏమైందంటే...

Crime News: యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి..
Crime News

Crime News: ఆదివారం రాత్రి పబ్‌లో పార్టీ (Pub Party) జరిగింది. తెల్లవారేసరికి యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి (Suspicious death) చెందిన ఘటన కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. హర్షవర్ధన్ అనే వ్యక్తి సికింద్రాబాద్‌ (Secunderabad)లోని ఓ ఏసీ కంపెనీ (AC Company)లో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ (Senior Executive)గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో స్నేహితులు, తోటి ఉద్యోగులతో కలిసి కొండాపూర్ క్వాక్ పబ్‌లో ఆదివారం రాత్రి పార్టీ చేసుకున్నాడు. పబ్ నుంచి గచ్చిబౌలిలోని అపార్టుమెంట్‌కు హర్షవర్ధన్, అతని స్నేహితులు వచ్చారు. అపార్టుమెంట్‌లో మరోసారి అందరూ మద్యం సేవించారు. అయితే తెల్లవారుజామున హర్షవర్ధన్‌కు వాంతులు అయ్యాయి. దీంతో అతని స్నేహితులు ఏఐజీ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ హర్షవర్ధన్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు ఆస్పత్రికి చేరుకుని అనుమానాస్పద స్థితి మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా హర్షవర్ధన్ విజయనగరం జిల్లా ప్రసాద్ నగర్‌కి చెందిన వ్యక్తిగా తెలిసింది.


కీసర నాగారంలో దారుణం..

కీసర నాగారంలో దారుణం జరిగింది. బైక్‌పై వెళ్తున్న భార్యాభర్తలపై విద్యుత్ తీగ తెగిపడింది. ఈ ఘటనలో భార్య మృతిచెందగా.. భర్త, మూడేళ్ల బాబుకు తీవ్రగాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళితే.. బాపురెడ్డి కాలనీకి చెందిన సురేశ్, మౌనిక.. తమ మూడేళ్ల కుమారుడు శ్రేయాస్‌తో కలిసి బైక్‌పై వెళ్తుండగా.. ఈదురుగాలులకు తెగిపడ్డ విద్యుత్ తీగ బైక్‌పై పడింది. మౌనికపై తీగ పడటంతో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతూ భార్య మౌనిక మృతి చెందింది. సురేష్, శ్రేయాస్ చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఫిలింనగర్ పీఎస్ పరిధిలో దారుణం..

ఫిలింనగర్ పీఎస్ పరిధిలో దారుణం జరిగింది. కొబ్బరి బొండాలు నరికే కత్తితో భార్యపై భర్త అప్పల నాయుడు దాడి చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: మావోయిస్టు మృత దేహాల తరలింపులో అడ్డంకులు...


మెదక్ జిల్లాలో రోడ్డుప్రమాదం..

మెదక్ జిల్లా రామాయంపేట 44వ జాతీయ రహదారి వై జంక్షన్ వద్ద సోమవారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో నిజామాబాద్ జిల్లా డిచ్చిపల్లికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి నిఖిల్ మృతిచెందగా.. నితీష్ అనే వ్యక్తికి గాయాలు అయ్యాయి. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య..

కేబీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్‌నగర్‌లో రతన్‌లాల్ అనే వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఐటీసీ సంస్థలో సేల్స్ మ్యాన్‌గా పని చేస్తున్న రతన్ లాల్... కుటుంబ కలహాలతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘన ప్రదేశానికి చేరుకుని పోస్టు మార్టం నిమిత్తం మృత దేహాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

జమ్మలమడుగు శివారెడ్డి కాలనీలో దారుణం

మిస్ ఇంగ్లండ్ వ్యాఖ్యలపై సర్కార్ సీరియస్

For More AP News and Telugu News

Updated Date - May 26 , 2025 | 11:02 AM