టీడీపీలో నవశకం.. పార్టీ మరింత పటిష్టం
ABN, Publish Date - Dec 04 , 2025 | 09:30 AM
ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ.. పార్టీ బలోపేతానికి కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. వరుసగా మూడుసార్లు పార్టీ పదవుల్లో ఉన్న వారిని తప్పించి.. యువతకు అవకాశం కల్పిస్తుంది. దీంతో పార్టీలో కొత్త రక్తం ప్రవహిస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: తెలుగు దేశం పార్టీలో కొత్త రక్తం ప్రవహిస్తోంది. యువతను పార్టీ మండల అధ్యక్షులుగా నియమించడంతో శిక్షణలో పార్టీ సిద్ధాంతాలను నూరి పోస్తున్నారు. వరుసగా మూడుసార్లు పార్టీ పదవుల్లో ఉంటే తర్వాత కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే నిబంధన టీడీపీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నిబంధన ప్రకారం.. ఈ సారి మండల అధ్యక్షులు, ఇతర పార్టీ పదవుల ఎంపికలో మహిళలు, యువకులకు అవకాశం కల్పించారు. ఈ క్రమంలో కొత్తగా పార్టీ పదవుల్లో నియమితులైన వారికి పార్టీ అధిష్టానం శిక్షణ ఇస్తున్నారు. టీడీపీ చరిత్ర, విజయగాథలు, పోరాట పటిమ గురించి శిక్షణ ఇస్తున్నారు. మరి.. మండల అధ్యక్షులుగా ఎంపికైన యువతకు టీడీపీ ఇస్తున్న శిక్షణ కార్యక్రమానికి సంబంధించి పూర్తి స్టోరీ కోసం పై వీడియోను క్లిక్ చేయండి.
ఇవీ చదవండి:
Bride Saves Guest: పెళ్లికి వచ్చిన అతిథిని కాపాడిన పెళ్లి కూతురు.. వీడియో వైరల్
జనరిక్ సెమాగ్లుటైడ్ తయారీకి డాక్టర్ రెడ్డీస్‌కు గ్రీన్ సిగ్నల్
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Dec 04 , 2025 | 09:32 AM