Dr. Reddys Labs: జనరిక్ సెమాగ్లుటైడ్ తయారీకి డాక్టర్ రెడ్డీస్‌కు గ్రీన్ సిగ్నల్
ABN , Publish Date - Dec 04 , 2025 | 05:59 AM
డెన్మార్క్ కేంద్రంగా పనిచేసే బహళజాతి ఫార్మా కంపెనీ నోవో నార్డి్‌స్కకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. వెయిట్‌లాస్ ఔషధం ‘సెమాగ్లుటైడ్’ను డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ తయారుచేయకుండా......
నోవో నార్డి్‌స్కకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు
న్యూఢిల్లీ: డెన్మార్క్ కేంద్రంగా పనిచేసే బహళజాతి ఫార్మా కంపెనీ నోవో నార్డి్‌స్కకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. వెయిట్‌లాస్ ఔషధం ‘సెమాగ్లుటైడ్’ను డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ తయారుచేయకుండా అడ్డుకోవాలన్న కంపెనీ కుయుక్తులు బెడిసి కొట్టాయి. తమ కు పేటెంట్ ఉన్న ఈ ఔషధాన్ని వచ్చే ఏడా ది మార్చి వరకు డాక్టర్ రెడ్డీ ల్యాబ్స్ జనరిక్ ఔషధంగా తయారుచేసేందుకు వీల్లేదన్న కంపెనీ వాదనని ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చిం ది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఈ ఔషధాన్ని జనరిక్ రూపంలో తయారుచేసి దేశ, విదేశాల్లో మార్కెట్ చేసుకోవచ్చని తెలిపింది. అయితే నోవో నార్డిస్క్ కంపెనీకి పేటెంట్ హక్కులు లేని దేశాలకు మాత్రమే ఈ అనుమతి వర్తిస్తుందని స్పష్టం చేసింది.
రూ.850 కోట్ల మార్కెట్ : ఊబకాయాన్ని తగ్గించడంతో పాటు చక్కెర వ్యాధి నియంత్రణ కోసం ‘సెమాగ్లుటైడ్’ ఔషధాన్ని ఉపయోగిస్తారు. ఈ పేటెంట్ ఔషధాన్ని నోవో నార్డిస్క్ కంపెనీ వెగోవీ పేరుతోను, ఇలీ లిల్లీ కంపెనీ మొంజారో పేరుతోను మన దేశంలో భారీ ధరతో మార్కెట్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ రెండు ఔషధాల అమ్మకాలు రూ.850 కోట్ల వరకు ఉన్నాయి. దేశీయ ఫార్మా కంపెనీలు చౌకగా జనరిక్ రూపంలో వెగోవీ ఔషధాన్ని తయారు చేసేందుకు ప్రయత్నించినా, పేటెంట్ హక్కుల పేరుతో నోవో నార్డిస్క్ అడ్డుకుంటోంది. అయితే విస్తృత ప్రజా ప్రయోజనాలను దృష్టి లో ఉంచుకుని ఢిల్లీ హైకోర్టు, డాక్టర్ రెడ్డీకు ఈ అనుమతి ఇచ్చినట్టు భావిస్తున్నారు.
మరింత తగ్గనున్న ధర
అమెరికా ఔషధ దిగ్గజం ఇలీ లిల్లీ ప్రవేశంతో నోవో నార్డిస్క్ కంపెనీ ‘వెగోవి’ ధరను ఇప్పటికే 37ు తగ్గించింది. దీని కి తోడు ఎమ్‌కో ఫార్మాతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుని అమ్మకాలు పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఢిల్లీ హైకోర్టు తీర్పుతో దేశీయ ఫార్మా దిగ్గజా లు త్వరలోనే అత్యంత చౌకగా సెమాగ్లుటైడ్ జనరిక్ ఔషధాలను మార్కెట్‌కు తేనున్నాయి. దీంతో నోవో నార్డిస్క్ కంపెనీ ఔషధం వెగోవికి మన దేశంతో పాటు, తనకు పేటెంట్ హక్కులు లేని దేశాల్లోనూ గండి పడనుంది.