తప్పిన ప్రమాదం.. చెన్నైలో రోడ్డుపై ల్యాండైన విమానం
ABN, Publish Date - Nov 13 , 2025 | 08:35 PM
చెన్నైలో నేషనల్ హైవేపై ఓ ప్రైవేట్ ట్రైనర్ విమానం అత్యవసరంగా ల్యాండైంది. గురువారం సెస్ నా-172 అనే ట్రైనర్ ఫ్లైట్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలెట్ తిరుచ్చి-పుదుక్కోటై జాతీయ రహదారిపై ల్యాండ్ చేశాడు.
తమిళనాడు రాష్ట్రం చెన్నైలో నేషనల్ హైవేపై ఓ ప్రైవేట్ ట్రైనర్ విమానం అత్యవసరంగా ల్యాండైంది. గురువారం సెస్ నా-172 అనే ట్రైనర్ ఫ్లైట్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలెట్ తిరుచ్చి-పుదుక్కోటై జాతీయ రహదారిపై ల్యాండ్ చేశాడు. ఆ విమానం సేలంలో పనిచేస్తున్న ఒక ప్రైవేట్ శిక్షణా సంస్థకు చెందినదని అధికారులు తెలిపారు. ఈ శిక్షణ విమానంలో సాంకేతిక లోపం గుర్తించబడిందని, వెంటనే దానిని హైవేపై ల్యాండ్ చేయాల్సి వచ్చిందని అధికారులు స్పష్టం చేశారు. అత్యవసర ల్యాండింగ్ గురువారం మధ్యాహ్నం 12 గంటలకు జరిగింది. అకస్మాత్తుగా విమానం రోడ్డుపై ల్యాండ్ కావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అసలు ఏం జరిగిందో తెలియక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కాసేపు ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.
ఇవి కూడా చదవండి:
భద్రతా సమస్యలు.. పాక్ నుంచి తిరిగెళ్లిపోనున్న శ్రీలంక క్రికెటర్లు
మరో రికార్డుపై కన్నేసిన కేఎల్ రాహుల్..!
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Nov 13 , 2025 | 10:11 PM