Pocharam Dam: భారీ వరదలు వచ్చినా తట్టుకొని నిలబడ్డ పోచారం ప్రాజెక్టు
ABN, Publish Date - Aug 29 , 2025 | 01:59 PM
తెలంగాణలో భారీ వర్షాలతో కామారెడ్డి, మెదక్ జిల్లాలను వరదలు ముంచెత్తాయి. చెరువులు, కట్టలు తెగిపోయి ప్రవహించాయి. 43 సెంటీమీటర్ల వర్షపాతంతో ఎక్కడా లేని వరద నీరు జిల్లాల్లో ప్రవహించింది.
తెలంగాణలో భారీ వర్షాలతో కామారెడ్డి, మెదక్ జిల్లాలను వరదలు ముంచెత్తాయి. చెరువులు, కట్టలు తెగిపోయి ప్రవహించాయి. 43 సెంటీమీటర్ల వర్షపాతంతో ఎక్కడా లేని వరద నీరు జిల్లాల్లో ప్రవహించింది. ఏ చెరువుకు ఎప్పుడు గండి పడుతుందో అర్థం కాక అధికారులు టెన్షన్ పడిపోయారు. జన జీవనం స్తంభించిపోయిన వేళ.. ఒక ప్రాజెక్ట్ పైనే అందరి భయం నెలకొంది. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి పేట మండలంలోని పోచారం డ్యామ్‌కు సామర్థ్యానికి మించి వరద నీరు పోటెత్తడంతో గేట్లు తెరిచి ఉంచినా.. డ్యామ్ పైనుంచి వరద ఉప్పొంగింది. భయానకంగా ప్రవహిస్తున్న వరదతో బుధవారం రాత్రి మొత్తం పరిసర ప్రాంతాల ప్రజలు భయంతో నిద్రపోలేదు. అయితే భారీ వరదను సైతం ఈ డ్యామ్ తట్టుకుని నిలబడింది.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి...
Updated Date - Aug 29 , 2025 | 02:04 PM