మత్స్యకారుల వలలో చిక్కిన భారీ తిమింగలం
ABN, Publish Date - Dec 21 , 2025 | 11:27 AM
సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు భారీ తిమింగలం చిక్కింది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకకు చెందిన మత్స్యకారులు శనివారం సముద్రంలో వల వేయగా బాగా బరువు అనిపించింది. దీంతో వలలో పెద్దఎత్తున చేపలు పడినట్లు మత్స్యకారులు భావించారు. వలను కొద్ది దూరం లాక్కొచ్చాక అందులో తిమింగలం పడినట్లు గుర్తించారు.
అనకాపల్లి, డిసెంబర్ 21: సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు భారీ తిమింగలం చిక్కింది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకకు చెందిన మత్స్యకారులు శనివారం సముద్రంలో వల వేయగా బాగా బరువు అనిపించింది. దీంతో వలలో పెద్దఎత్తున చేపలు పడినట్లు మత్స్యకారులు భావించారు. వలను కొద్ది దూరం లాక్కొచ్చాక అందులో తిమింగలం పడినట్లు గుర్తించారు. వెంటనే దాన్ని ఒడ్డుకు తీసుకొచ్చి, వల నుంచి విడిపించారు. స్థానికుల సాయంతో తిరిగి సముద్రంలోకి తిమింగలాన్ని పంపించారు. అప్పటికే అది కొన ఊపిరితో ఉన్నట్లు మత్స్యకారులు తెలిపారు. అయితే అది మృతి చెందినట్లు మరికొందరు చెబుతున్నారు. దీని బరువు రెండున్నర టన్నుల వరకు ఉంటుందని మత్స్యకారులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం పై వీడియోను వీక్షించండి.
ఇవి కూడా చదవండి
ప్రేమ పేరుతో మైనర్ బాలికకు వేధింపులు.. ఇద్దరు యువకులు అరెస్ట్..
స్కూల్ వ్యాన్ రాలేదని.. రోడ్డుపైనే 3 గంటల పాటు చిన్నారి...
Updated Date - Dec 21 , 2025 | 11:27 AM