Karnataka bus Driver: బస్సు ఆపి మరీ నమాజ్.. డ్రైవర్ నిర్వాకంపై అంతా ఆగ్రహం..
ABN, First Publish Date - 2025-05-02T15:25:19+05:30
కర్ణాటక ఆర్టీసీ బస్సు డ్రైవర్ బస్సు ఆపి, అందులోనే నమాజ్ చేయడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. బస్సును ఉన్నఫలంగా ఆపి, సీటులో మోకాళ్లపై కూర్చుని మరీ నమాజ్ చేయడంతో.. ప్రార్థన పూర్తయ్యే వరకూ ప్రయాణికులంతా వేచి చూడాల్సి వచ్చింది. హుబ్లీ-హవేరి మార్గంలోని జవేరి సమీపంలో మంగళవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది.
కర్ణాటక ఆర్టీసీ బస్సు డ్రైవర్ బస్సు ఆపి, అందులోనే నమాజ్ చేయడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. బస్సును ఉన్నఫలంగా ఆపి, సీటులో మోకాళ్లపై కూర్చుని మరీ నమాజ్ చేయడంతో.. ప్రార్థన పూర్తయ్యే వరకూ ప్రయాణికులంతా వేచి చూడాల్సి వచ్చింది. హుబ్లీ-హవేరి మార్గంలోని జవేరి సమీపంలో మంగళవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. రహదారి పక్కన బస్సును నిలిపేసిన డ్రైవర్.. సీటులో కూర్చుని నమాజ్ చేశారు. దీంతో ప్రయాణికులంతా ఆ ప్రార్థన పూర్తయ్యే వరకూ వేచి చూశారు. తీవ్ర అసహనానికి గురైన కొందరు ప్రయాణికులు.. ఆస్టీసీ అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ సంస్థల్లో పని చేసే సిబ్బంది తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని తేల్చి చెప్పారు. ప్రతి ఒక్కరికీ తమ మతాన్ని ఆచరించే హక్కు ఉంటుందని, అయితే విధుల్లో ఉన్న సమయాల్లో ఇలాంటివి పనికిరాదని, ఇతర సమయాల్లో చూసుకోవాలని చెప్పారు. ప్రయాణికులు ఉన్న సమయంలో బస్సును ఆపి మరీ నమాజ్ చేయడం తీవ్ర అభ్యంతకరమని మంత్రి పేర్కొన్నారు. విచారణ చేసి, డ్రైవర్ తప్పు ఉందని తేలితే తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశంచారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated Date - 2025-05-02T15:25:20+05:30 IST