డేంజర్ జోన్.. అక్కడే ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి?
ABN, Publish Date - Nov 03 , 2025 | 02:13 PM
రోడ్డు చిన్నగా ఉందని.. రోడ్డును వెడల్పు చేస్తే తప్ప ప్రమాదాలు ఆగవని చెబుతున్నారు. ఆ ప్రాంతంలో ఎన్నో ప్రమాదాలు జరిగినప్పటికీ రాజకీయ నాయకులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
రంగారెడ్డి, నవంబర్ 3: జిల్లాలోని చేవెళ్ళ మండలం మీర్జాగూడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది మృత్యువాత పడ్డారు. ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే పోలీసులు, అధికారులు అక్కడకు చేరుకుని మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం డెడ్‌బాడీలను అధికారులు బంధువులకు అప్పగిస్తున్నారు. ఇక ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ఇప్పటికే డేంజర్ జోన్‌గా గుర్తించారు. గతంలో ఇదే ప్రాంతంలో ఎన్నో ప్రమాదాలు జరుగగా.. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది క్షతగాత్రులు అయ్యారు.
రోడ్డు చిన్నగా ఉందని.. రోడ్డును వెడల్పు చేస్తే తప్ప ప్రమాదాలు ఆగవని చెబుతున్నారు. ఆ ప్రాంతంలో ఎన్నో ప్రమాదాలు జరిగినప్పటికీ రాజకీయ నాయకులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ప్రమాద స్థలికి క్లూస్ టీం చేరుకుని ఆధారాలు సేకరించే పనిలో పడింది. కర్నూలు ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదం ఘటన మరువక ముందు చేవెళ్లలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురవడం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
ఇవి కూడా చదవండి...
చేవెళ్ల బస్సు ప్రమాదంపై ఏపీ డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి
చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. చంద్రబాబు, లోకేష్ సంతాపం
Read Latest Telangana News And Telugu News
Updated Date - Nov 03 , 2025 | 02:17 PM