Home » Chevella
చేవెళ్ల ప్రమాద ఘటనపై డిసెంబర్ 15లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని రోడ్లు రవాణా, భవనాల శాఖ, హోంశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీలకు కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
చేవెళ్ల రోడ్డు ప్రమాద ఘటనలో తమ కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థినులు మృతిచెందడం బాధాకరమని కోఠిలోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ లోకపావని అన్నారు
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో వికారాబాద్-హైదరాబాద్ ప్రధాన రహదారిపై సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది అక్కడికక్కడే మృతి చెందారు...
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో సోమవారం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తెలంగాణ ఆర్టీసీ బస్సు, టిప్పర్ డ్రైవర్లతో పాటు 19 మంది మృతిచెందగా.. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 10 మంది మహిళలు, 8 మంది పురుషులు, ఒక చిన్నారి ఉన్నారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాకూడా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో 19 మంది దుర్మరణం చెందారు. మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. పోస్టు మార్టం నిర్వహించారు.
రోడ్డు చిన్నగా ఉందని.. రోడ్డును వెడల్పు చేస్తే తప్ప ప్రమాదాలు ఆగవని చెబుతున్నారు. ఆ ప్రాంతంలో ఎన్నో ప్రమాదాలు జరిగినప్పటికీ రాజకీయ నాయకులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
బస్సును టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు స్పాట్‌లో మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే తల్లిదండ్రులు అక్కడకు చేరుకుని తమ బిడ్డల కోసం ఆరా తీయగా.. వారు చనిపోయినట్లు తెలియడంతో గుండెలవిసేలా రోదిస్తున్నారు.
రంగారెడ్డి జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. బస్సులో ఉన్న ప్రయాణికులపై కంకర పడిపోవడంతో 21 మంది మృతి చెందారు. దీనికి సంబంధించి ఏబీఎన్ ఏఐ వీడియో రూపొందించింది.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ గేటు వద్ద ఇవాళ జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కొత్తేమీ కాదు. ఇప్పటివరకు ఈ రహదారి మీద 200 మంది మృతి చెందారు, 600 మంది గాయాలపాలయ్యారు. అసలు ఆ రోడ్డు మీద ఎందుకిలా జనం..
చేవెళ్ల బస్సు ప్రమాదంలో మృతిచెందిన మృతుల వివరాలను అధికారులు వెల్లడించారు.