Chevella Accident: చేవెళ్ల ప్రమాదం జరిగిన తీరుపై ఏబీఎన్ ఏఐ వీడియో
ABN , Publish Date - Nov 03 , 2025 | 12:10 PM
రంగారెడ్డి జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. బస్సులో ఉన్న ప్రయాణికులపై కంకర పడిపోవడంతో 21 మంది మృతి చెందారు. దీనికి సంబంధించి ఏబీఎన్ ఏఐ వీడియో రూపొందించింది.
రంగారెడ్డి: చేవెళ్లలో ఇవాళ(సోమవారం) ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. తాండూరు డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఈ ఘటన జరిగింది. బస్సులో ఉన్న ప్రయాణికులపై కంకర పడిపోవడంతో 21 మంది మృతి చెందగా.. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇలా జరిగింది..
ప్రమాదం జరిగిన తీరుపై ఏబీఎన్ ఏఐ కళ్లకు కట్టినట్లు వీడియో రూపొందించింది. ఆర్టీసీ బస్సు ఇవాళ ఉదయం తాండూరు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. మొత్తం 54 మందికి గానూ బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు ప్రయాణిస్తున్న సమయంలో అతివేగంగా కంకర లోడ్‌తో వస్తున్న టిప్పర్ ఢీకొట్టింది. దీంతో బస్సు లోపలికి టిప్పర్ దూసుకెళ్లింది. టిప్పర్‌లో ఉన్న కంకర.. బస్సులో పడటంతో ముందు వరుసలో ఉన్న ఆరు సీట్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. స్పాట్‌లోనే 18 మంది మృతి చెందారు. రోడ్డు ప్రమాదంతో హైదరాబాద్-బీజాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్‌జామ్ అయింది. చేవెళ్ల-వికారాబాద్ మార్గంలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఘటనా స్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
Infectious Diseases: భారత్‌లో పెరుగుతున్న అంటువ్యాధులు