Chevella Road Accident: చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. మృతదేహాలకి పోస్టుమార్టం పూర్తి.. బంధువులకు అప్పగింత
ABN , Publish Date - Nov 03 , 2025 | 05:43 PM
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో సోమవారం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తెలంగాణ ఆర్టీసీ బస్సు, టిప్పర్ డ్రైవర్లతో పాటు 19 మంది మృతిచెందగా.. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 10 మంది మహిళలు, 8 మంది పురుషులు, ఒక చిన్నారి ఉన్నారు.
రంగారెడ్డి జిల్లా, నవంబరు3 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా (Rangareddy Dist) చేవెళ్లలో ఇవాళ(సోమవారం) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ఘటనలో తెలంగాణ ఆర్టీసీ బస్సు, టిప్పర్ డ్రైవర్లతో పాటు 19 మంది మృతిచెందగా.. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 10 మంది మహిళలు, 8 మంది పురుషులు, ఒక చిన్నారి ఉన్నారు. ఖానాపూర్ గేట్ దగ్గర ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొనడంతోనే ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. మృతుల్లో ఎక్కువగా తాండూరు వాసులు ఉన్నారు. అయితే, చేవెళ్ల ప్రభుత్వాస్పత్రిలో 18 మంది మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి అయింది.
తాండూరు, వికారాబాద్, గాంధీ, ఉస్మానియా వైద్యులు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాలు అప్పగించారు. మృతదేహాలని వారి స్వస్థలాలకి పంపించారు. నాగమణి మృతదేహం కర్ణాటకలోని భానూర్‌కు తరలించారు. అనూష, సాయిప్రియ, నందిని, నజీర్ అహ్మద్, విద్యార్థి అఖిల మృతదేహాలని తాండూరుకు పంపించారు. అలాగే, కల్పన, గుణమ్మ మృతదేహాలు హైదరాబాద్ బోరబండకు.. తారిబాయి మృతదేహం గంగారం తండాకు తరలించారు.
టిప్పర్ డ్రైవర్ ఆకాష్ బ్లడ్ శాంపిల్స్ సేకరించిన పోలీసులు..
అలాగే, టిప్పర్ డ్రైవర్ ఆకాష్ మృతదేహానికి చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తి అయింది. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు. మరోవైపు ఆకాష్ బ్లడ్ శాంపిల్స్‌ని పోలీసులు సేకరించారు. బ్లడ్ శాంపిల్స్‌ని ల్యాబ్‌కు పంపించారు పోలీసులు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్
రాజకీయ దురుద్దేశంతోనే ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టును పక్కకు పెట్టారు.. కేసీఆర్‌పై సీఎం రేవంత్ ఫైర్
Read Latest Telangana News And Telugu News