Share News

Hyderabad: ‘చేవెళ్ల’ మృతుల్లో కోఠి మహిళా వర్సిటీ విద్యార్థినులు

ABN , Publish Date - Nov 04 , 2025 | 10:20 AM

చేవెళ్ల రోడ్డు ప్రమాద ఘటనలో తమ కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థినులు మృతిచెందడం బాధాకరమని కోఠిలోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ లోకపావని అన్నారు

Hyderabad: ‘చేవెళ్ల’ మృతుల్లో కోఠి మహిళా వర్సిటీ విద్యార్థినులు

హైదరాబాద్: చేవెళ్ల(Chevella) రోడ్డు ప్రమాద ఘటనలో తమ కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థినులు మృతిచెందడం బాధాకరమని కోఠిలోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ లోకపావని(Vice Chancellor Dr. Lokapavani) అన్నారు. కళాశాలలో సోమవారం సంతాప సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినుల మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.


city8.jpg

తమ కళాశాలకు చెందిన బీఎస్సీ తృతీయ సంవత్సరం చదువుతున్న సాయిప్రియ, బీకాం ఫస్టియర్‌ చదువుతున్న ఈ.నందని, ఎంపీసీఈఎస్‌ తృతీయ సంవత్సరం చదువుతున్న ముస్కాన్‌లు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమన్నారు. వారి ఆత్మలకు శాంతికలగాలని ప్రార్థించారు. తోటి విద్యార్థినులు కన్నీరుమున్నీరయ్యారు. వారి మరణంతో మహిళా వర్సిటీలో విషాదఛాయలు అలముకున్నాయి.


city8.3.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

ఓటర్ల సమస్యకు సత్వర పరిష్కారం

అన్ని జిల్లాల్లో 400 కేవీ సబ్‌స్టేషన్లు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 04 , 2025 | 10:35 AM