Heavy Rains: ఇంద్రవెల్లి వాగులో కొట్టుకుపోయిన ఆటో
ABN, Publish Date - Sep 03 , 2025 | 08:56 PM
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని వాగులో ప్రయాణికులతో వెళ్తున్న ఆటో కొట్టుకుపోయింది. ప్రవాహం ఉన్నా కూడా ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని వాగులో ప్రయాణికులతో వెళ్తున్న ఆటో కొట్టుకుపోయింది. ప్రవాహం ఉన్నా కూడా ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో వాగులో ప్రవాహ దాటికి ఆటో ఒక్కసారిగా కొట్టుకుపోయింది. అక్కడే ఉన్న స్థానికులు వెంటనే స్పందించి, వారిని బయటికి తీసి కాపాడారు. పోలీసులు, అధికారులు రహదారిని మూసేశారు. వాగులు ప్రవహించే ప్రాంతాల్లో ఎవరూ నిర్లక్ష్యంగా ఉండొద్దని హెచ్చరించారు.
Updated Date - Sep 03 , 2025 | 08:56 PM