Iran vs Israel: ఇరాన్ పై ఇజ్రాయెల్ వరుస దాడులు.. మరో టాప్ కమాండర్ మృతి
ABN, Publish Date - Jun 21 , 2025 | 09:57 PM
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మిసైల్ దాడులు కొనసాగుతున్నాయి. వెస్టిరాన్‌లో అణు కేంద్రాలతో పాటూ ఆర్మీ అధికారులే లక్ష్యంగా ఐవీఎఫ్ దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ సయీద్ ఇజాదీని మట్టుబెట్టినట్లుగా ఐవీఎఫ్ తన ఎక్స్ ఖాతా ద్వారా తెలిపింది.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మిసైల్ దాడులు కొనసాగుతున్నాయి. వెస్టిరాన్‌లో అణు కేంద్రాలతో పాటూ ఆర్మీ అధికారులే లక్ష్యంగా ఐవీఎఫ్ దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ సయీద్ ఇజాదీని మట్టుబెట్టినట్లుగా ఐవీఎఫ్ తన ఎక్స్ ఖాతా ద్వారా తెలిపింది. హమాస్‌తో సంబంధాలతో పాటూ ఉగ్రవాదులు చేస్తున్న ఆపరేషన్లకు సయీద్ ఇజాదీ కీలక నాయకత్వం వహిస్తున్నారని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. మరోవైపు ఇరాన్ అణు కేంద్రాలు, ఆర్మీ కేంద్రాలే లక్ష్యంగా తాము దాడులు చేస్తున్నామని ఐవీఎఫ్ చెబుతోంది. ఇదిలావుండగా, సెంట్రల్ ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్లను కొన్నింటిని ఐవీఎఫ్ అడ్డుకోగా.. మరికొన్ని స్థానిక భవనాలపై పడినట్లు సెంట్రల్ ఇజ్రాయెల్ అధికారులు చెబుతున్నారు.
Updated Date - Jun 21 , 2025 | 09:57 PM