ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Soft Chapati Making Tips: చపాతీలు మెత్తగా.. మృదువుగా రావాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

ABN, Publish Date - Oct 22 , 2025 | 09:46 AM

ఇంట్లో చేసుకునే చపాతీలు గట్టిగా వస్తాయి. ఇవి మెత్తగా .. మృదువుగా రావాలంటే.. ఈ చిట్కాలు ఫాలో కావాలి.

Soft Chapati Making Tips

ఇంట్లో చేసుకునే చపాతీలు.. లావుగా.. గట్టిగా ఉంటాయి. కానీ ఈ సింపుల్ ట్రిక్స్ పాటిస్తే మాత్రం చాలా మెత్తగా వాటిని తయారు చేసుకోవచ్చు. మెత్తని చపాతీలు తయారు చేయ్యాలంటే.. పిండిని మెత్తగా పిసికి కలుపుకోవాలి. అలా ఎందుకుంటే.. పిండిని సరిగ్గా పిసికి కలుపకపోతే.. చపాతీలు రుచికరంగా ఉండవు. అలాగే చపాతీలు మృదువుగా రావు.

  • ఇక చపాతీలు మృదువుగా రావాలంటే.. తొలుత నాణ్యమైన గోధుమ పిండిని ఎంచుకోవాలి. అందులో కల్తీ లేకుండా చూసుకోవాలి. అంటే.. చపాతీ మెత్తగా రావాలంటే.. మంచి నాణ్యమైన గోధుమ పిండిని ఎంపిక చేసుకోవాలి.

  • పిండిలో నూనె కలపాలి.. అంటే పిండిని పిసికి కలుపుతున్నప్పుడు కొద్దిగా నూనె కలపాలి. అలా చేయడం వల్ల పిండి మృదువుగా ఉంటుంది. అంతేకాదు.. చపాతీలు మృదువుగా ఉబ్బినట్లుగా తయారవుతాయి.

  • పిండిని పిసికి కలుపుతున్నప్పుడు గోరు వెచ్చని నీటిని తీసుకోవాలి. ఎందుకంటే.. చల్లటి నీటిని వాడడం వల్ల పిండి గట్టిగా ఉంటుంది. అందువల్ల.. గోరు వెచ్చని నీటిని వాడడం వల్ల పిండిని మెత్తగా సులభంగా కలుపుకోవచ్చు.

  • ఈ పిండిని కలుపుతున్నప్పుడు కొద్ది కొద్దిగా నీటిని అందులో వినియోగించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకేసారి అధికంగా నీటిని కలపడం వల్ల పిండి పల్చబడే అవకాశం ఉంది. ఇక పిండిని గోధుమ పిండిని కలుపుతున్నప్పుడు.. అది మెత్తగా ఉండేలా చూసుకోవాలి. ఉండలు లేకుండా చూసుకోవాలి.

  • పిండిని కలిపిన తర్వాత.. కొంత సేపు అలాగే ఉంచాలి. అంటే.. ఈ కలిపిన పిండిని కాసేపు కాటన్ వస్త్రంతో కప్పి ఉంచాలి. ఆ తర్వాత చపాతీలు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చపాతీలు మెత్తగా.. మృదువుగా వస్తాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

‘భైమి’ ... పవిత్రమైన హల్వా

అలా తీసి.. ఇలా వండేయొచ్చు..

For More Vantalu News And Telugu News

Updated Date - Oct 22 , 2025 | 09:46 AM