Vantalu: అలా తీసి.. ఇలా వండేయొచ్చు..
ABN , Publish Date - Oct 09 , 2025 | 11:49 AM
నగరంలో దాదాపు అందరివీ బిజీ జీవితాలే. వారానికొకసారి కూరగాయలు తెచ్చుకోవడం వారాంతం వరకు ఫ్రిజ్‌లో దాచుకోవడం. ఉన్నవాటితోనే ఏదో వంటకాన్ని చేసేయడం చాలా మంది చేసే పనే.
- మార్కెట్‌లో డీ హైడ్రేటెడ్/డ్రైడ్ వెజిటబుల్ ఫ్లెక్స్
- సమయం ఆదాతో రెడీమేడ్ కూరగాయల ముక్కలపై నగరవాసుల చూపు
హైదరాబాద్: నగరంలో దాదాపు అందరివీ బిజీ జీవితాలే. వారానికొకసారి కూరగాయలు తెచ్చుకోవడం వారాంతం వరకు ఫ్రిజ్‌లో దాచుకోవడం. ఉన్నవాటితోనే ఏదో వంటకాన్ని చేసేయడం చాలా మంది చేసే పనే. కందిపప్పు, పెసరపప్పుల్లానే రక రకాల కూరగాయల ముక్కల్ని ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు డబ్బాల్లో దాచుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు వంటల్లో వాడుకునే వీలుంటే ఎంత బాగుంటుందని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అందుకే నగర వాసుల సౌలభ్యం కోసం మార్కెట్లోకి డీ హైడ్రేటెడ్ వెజిటబుల్ ఫ్లెక్స్ అందుబాటులోకి వచ్చాయి.

ఈ వెజిటబుల్ ఫ్లెక్స్ దేనికదే విడిగాను, అన్ని కలిపి కూడా దొరుకుతున్నాయి. ఈ డ్రైడ్ వెజిటబుల్ ఫ్లెక్స్‌తో ఎప్పుడు కావాలంటే అప్పుడు కూరలు చేసుకోవచ్చు. వీటిని కాసేపు నానబెట్టి మామూలు కూరల్లానే వండేసుకోవచ్చు పైగా వీటిని ముక్కలుగా కోసే పని కూడా ఉండదు. పాలకూర, టొమాటో, బంగాళదుంప, క్యారెట్, కాకర బీట్‌రూట్, క్యాబేజీ, కాలీఫ్లవర్, పుట్టగొడుగులు ఇలా రక రకాల కూరగాయలు, ఆకు కూరలతో పాటు పచ్చి మిర్చి ఉల్లి పాయలు కూడా ఎండబెట్టినవి వస్తున్నాయి.

ఎంతకాలమైనా పాడవవు..
మారుతున్న అవసరాల కోసం నిల్వ ఉండే కూరగాయ ముక్కలను ప్రజలకు అందబాటులో ఉంచేందుకు పలు కంపెనీలు డీ హైడ్రేటెడ్/డ్రైడ్ వెజిటబుల్ ఫ్లెక్స్‌ని మార్కెట్‌లోకి తీసుకు వస్తున్నాయి. కూరగాయలు, దుంపల్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి ప్రత్యేక పద్ధతుల్లో వాటిలోని నీటిని తీసివేసి ఎండబెట్టడం ద్వారా ఫ్లెక్స్‌ను తయారు చేస్తున్నారు. ఈ కూరగాయల ముక్కల్ని ఓ 20 నిముషాల ముందు నీళ్లలో నాన బెట్టుకుంటే మామూలు కూరగాయ ముక్కల్లా అయిపోతాయి. వాటిని ఫ్రైడ్ రైస్ నూడుల్స్ లాంటి వంటకాల్లో వాడుకోవచ్చు. ఒరుగుల్లా ఒడియాల్లా ఇవి ఎంతకాలమైనా పాడవకుండా ఉంటుండడంతో వీటిని కొనేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారు.

సూప్‌ల కోసం ఎండబెట్టిన స్వీట్ కార్న్‌కూడా దొరుకుతున్నాయి. తొందరగా ఇంట్లో ఫ్రైడ్ రైస్, నూడుల్స్, సూప్ లాంటివి చెయ్యాలంటే ఆలూ క్యారెట్, బీన్స్, బఠాని, క్యాబేజీ ఇలా నాలుగైదు రకాల కూరగాయ ముక్కలు కొన్ని కావాలి. అన్ని కూరగాయలూ ఇంట్లో రడీగా ఉండక పోవచ్చు. కొని తెద్దామన్నా ఒకటి రెండు దుంపలు, చిన్న క్యాబేజీ ముక్క అమ్మరు. ఎక్కువ కొంటే మిగిలినవి పాడైపోతాయి. ఇలాంటి సమయంలో డీ హైడ్రేటెడ్/డ్రైడ్ వెజిటబుల్ ఫ్లెక్స్ ఎంతో ఉప యోగపడుతున్నాయని, వీటి వలన సమయం కూడా ఆదా అవుతోందని నగర వాసులు చెబుతున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..
పసిడికి పగ్గాల్లేవ్.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
భారత్ దాల్.. అంతా గోల్‌మాల్!
Read Latest Telangana News and National News