ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Loan App: లోన్‌ యాప్‌లకు యువకుడు బలి

ABN, Publish Date - Jun 30 , 2025 | 05:17 AM

లోన్‌ యాప్‌ల ఉచ్చులో చిక్కుకున్న ఓ యువకుడు అప్పుల పాలై, వాటిని తీర్చలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది.

శంషాబాద్‌ రూరల్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): లోన్‌ యాప్‌ల ఉచ్చులో చిక్కుకున్న ఓ యువకుడు అప్పుల పాలై, వాటిని తీర్చలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. మున్సిపల్‌ పరిధిలోని ఊట్‌పల్లికి చెందిన మహ్మద్‌ పరాజ్‌ ఖాన్‌(23) ప్రైవేటు ఉద్యోగి. పలు ఆన్‌లైన్‌ యాప్‌లలో రుణాలు తీసుకున్నాడు. వాటిని తిరిగి చెల్లించాలని యాప్‌ల నిర్వాహకులు ఒత్తిడి చేయడంతో మానసికంగా కుంగిపోయాడు. జీవితంపై విరక్తి చెందిన పరాజ్‌ ఖాన్‌ శనివారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు.

రాత్రి పది గంటలైనా గదిలో ఎలాంటి చప్పుడు లేకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి డోర్‌ పగులగొట్టి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. వెంటనే శంషాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు నిర్ధారించారు.

Updated Date - Jun 30 , 2025 | 05:17 AM