Hyderabad: ఎంత ఘోరం చేశావమ్మా..
ABN, Publish Date - Apr 17 , 2025 | 06:16 PM
నగరం శివారులోని గాజుల రామారంలో ఘోరం జరిగిపోయింది. కన్న తల్లే తన ఇద్దరు పిల్లలను చంపేసింది. ఆ పై తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అసలేం జరిగింది..
హైదరాబాద్, ఏప్రిల్ 17: నగరం శివారులోని గాజుల రామారంలో ఘోరం జరిగిపోయింది. కన్న తల్లే తన ఇద్దరు పిల్లలను చంపేసింది. ఆ పై తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అసలేం జరిగింది.. ఆ తల్లి తన పిల్లలను ఎందుకు చంపాల్సి వచ్చింది.. తానెందుకు చనిపోయింది.. పూర్తి వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం..
గాజుల రామారంలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. తన ఇద్దరు పిల్లలను కొడవలితో నరికి చంపింది. పిల్లలిద్దరూ చనిపోయారని నిర్ధారించుకున్నాక.. తానూ ఆత్మహత్య చేసుకుంది. భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనతో స్థానిక ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మహిళ ఇంతటి దారుణానికి పాల్పడటానికి కుటుంబ కలహాలే కారణం అని భావిస్తున్నారు. ఈ అంశంపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతులు తల్లి తేజస్విని, పిల్లలు హర్షిత్ రెడ్డి(11), ఆశిష్ రెడ్డి(9)గా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.
కాగా, మృతురాలు తేజస్విని వద్ద 6 పేజీల సూసైడ్ నోట్‌ను పోలీసులు గుర్తించారు. ముందుగానే అన్నింటికీ సిద్ధపడి ఇద్దరు కొడుకులు హర్షిత్ రెడ్డి, ఆశిష్ రెడ్డిలను కొబ్బరి బోండాల కత్తితో నరికింది. ఆ తరువాత 5 అంతస్తుల భవనం నుంచి దూకి సూసైడ్ చేసుకుంది. అయితే, చిన్న కొడుకు ఆశిష్ రెడ్డి కొన ఊపిరితో ఉండగా.. స్థానిక ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ, దురదృష్టవశాత్తు మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. సూసైడ్ లేఖ ఆధారంగా కుటుంబ తగాదాలే ఈ ఘటనకు కారణమని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.
Also Read:
IMD: ఐఎండీ అలర్ట్.. ఈ రాష్ట్రాల్లో ఏప్రిల్ 19 వరకు భారీ వర్షాలు
Bank Holiday: ఏప్రిల్ 18న బ్యాంకులు బంద్..ఒక రోజు తర్వాత మళ్లీ సెలవు..
Viral News: లవర్‌తో కలిసి భర్తను చంపేసిన భార్య..పాము కాటేసిందని చెప్పి, చివరకు కటకటాల్లోకి
For More Telangana News and Telugu News..
Updated Date - Apr 17 , 2025 | 06:21 PM