Share News

Viral News: లవర్‌తో కలిసి భర్తను చంపేసిన భార్య..పాము కాటేసిందని చెప్పి, చివరకు కటకటాల్లోకి

ABN , Publish Date - Apr 17 , 2025 | 04:55 PM

ఓ మహిళకు పెళ్లైంది. అయినా కూడా ప్రియుడితో మాత్రం వివాహేతర సంబంధం అలాగే కొనసాగించింది. అంతటితో ఆగలేదు. ఎలాగైనా తన భర్తను చంపేయాలని ప్రియుడితో కలిసి ప్లాన్ వేసి ఖతం చేసింది. కానీ అది కాస్తా వెలుగులోకి రావడంతో చివరకు జైలుపాలైంది. ఇది ఎక్కడ జరిగింది, ఎంటనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Viral News: లవర్‌తో కలిసి భర్తను చంపేసిన భార్య..పాము కాటేసిందని చెప్పి, చివరకు కటకటాల్లోకి
Meerut Uttar Pradesh crime news

ఇటీవల కాలంలో పెళ్లైన పలువురు మహిళలు తప్పుడు పనులు చేస్తూ భర్తలను ఆగం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ మహిళ ప్రియుడితో ప్రేమలో మునిగిపోయి, ఏకంగా భర్తను హత్య చేసింది. ప్రియుడితో కలిసి హత్య చేసిన తర్వాత ఎవరికి తెలియకూడదని చెప్పి పాము కాటుతో మరణించినట్లు చూపించేందుకు ప్లాన్ వేసింది. ఆ క్రమంలో భర్త శరీరం దగ్గర పామును ఉంచి, పాము కాటుతో మరణించాడని చిత్రీకరించడానికి ప్రయత్నించి, కుటుంబాన్ని, స్థానికులను తప్పుదారి పట్టించింది. ఈ విషయం తెలిసిన పోలీసులు రంగంలోకి దిగి కేసు విచారణ చేశారు. ఆ క్రమంలో పోస్ట్ మార్టం నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.


మోసం చేయాలని ప్రయత్నం

ఆ మహిళ భర్తకు ఎలాంటి పాము కాటుకు సంబంధించిన గుర్తులు లేవని తేలింది. నివేదికలో గొంతు కోసి చంపబడినట్లు వెలుగులోకి వచ్చింది. ఇది తెలిసిన పోలీసులు తమదైన శైలిలో ఆ మహిళను ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ మీరట్ జిల్లా బహసుమా ప్రాంతంలోని అక్బర్‌పూర్ సదత్ గ్రామంలో చోటుచేసుకుంది. భార్య రవిత, ఆమె ప్రేమికుడు అమర్‌దీప్ కలిసి భర్త అమిత్‌ను హత్య చేసి, దాన్ని పాము కాటుతో మరణించినట్లు కుటుంబాన్ని, పోలీసులను మోసం చేయాలని ప్రయత్నించి చివరకు దొరికిపోయారు.


చివరకు అరెస్ట్

విచారణలో రవిత అసలు విషయం ఒప్పుకోగా, ఆమె ప్రేమికుడు అమర్‌దీప్ రూ.1,000కు పాము కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ఈ ఘటనలో నిందితులను అరెస్టు చేశారు. ఈ ఘటనలో పామును విక్రయించిన వ్యక్తి గురించి కూడా పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. ఇప్పటికే ఇదే రాష్ట్రంలో డ్రమ్ములో ఓ భర్తను దారుణంగా హత్య చేసిన ఘటన మరువక ముందే, మళ్లీ ఇలాంటిది జరగడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇది తెలిసిన పలువురు రోజు రోజుకు ప్రేమ, కుటుంబ సంబంధాలు దారుణంగా మారుతున్నాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తప్పులతో చివరకు వారి జీవితాలు ఎక్కడికి దారి తీస్తాయో ఆలోచించడం లేదని అంటున్నారు.


ఇవి కూడా చదవండి:

IMD: ఐఎండీ అలర్ట్.. ఈ రాష్ట్రాల్లో ఏప్రిల్ 19 వరకు భారీ వర్షాలు

WhatsApp Security: మీ వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అయిందా..ఇలా ఈజీగా మళ్లీ యాక్సెస్‌ పొందండి..


Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..


Bill Gates: వారానికి మూడు రోజేలే పని..బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..


iPhone like Design: రూ.6 వేలకే ఐఫోన్ లాంటి స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్లు తెలిస్తే షాక్ అవుతారు..

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 17 , 2025 | 06:08 PM