Share News

WhatsApp Security: మీ వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అయిందా..ఇలా ఈజీగా మళ్లీ యాక్సెస్‌ పొందండి..

ABN , Publish Date - Apr 16 , 2025 | 04:40 PM

ఇప్పటి డిజిటల్ యుగంలో వ్యక్తిగత సమాచారాన్ని రక్షించుకోవడం చాలా ముఖ్యం. ప్రధానంగా మన నిత్య జీవితంలో భాగమైన వాట్సాప్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎప్పుడైనా మీది లేదా తెలిసిన వారి వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అయితే ఏం చేయాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

WhatsApp Security: మీ వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అయిందా..ఇలా ఈజీగా మళ్లీ యాక్సెస్‌ పొందండి..
WhatsApp Account Hacked

అప్పుడప్పుడు పలువురి వాట్సాప్ ఖాతాలు హ్యాక్ అవుతుంటాయి. రాజకీయ నాయకులు లేదా సెలబ్రిటీలవి ఎక్కువగా హ్యాక్ అయినట్లు చూస్తుంటాం. దీంతోపాటు వ్యాపారులు లేదా పలువురు మధ్యతరగతి ప్రజల అకౌంట్లు కూడా హ్యాక్ అయిన సందర్భాలు ఉన్నాయి. సాధారణంగా ఎవరిదైనా వాట్సాప్ ఖాతా హ్యాక్ చేయబడినప్పుడు, మీ వ్యక్తిగత సమాచారం, చాట్స్, ఫోటోలు, వీడియోలు ప్రమాదంలో పడవచ్చు.

ఇలాంటి పరిస్థితుల్లో ముందుగా ఆందోళన చెందకుండా పలు రకాల చర్యలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. మీకు మాత్రమే కాదు, మీకు తెలిసిన వారి ఖాతా విషయంలో ఇలా జరిగినా కూడా టెన్షన్ పడకూడదని చెబుతున్నారు. పలు రకాల చిట్కాలను పాటించడం ద్వారా మళ్లీ మీ ఖాతాను సురక్షితంగా తిరిగి పొందవచ్చని అంటున్నారు. అది ఎలా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అయితే ఇలా చేయండి

  • ఒక వేళ మీ ఫోన్ హ్యాక్ అయినట్లు మీకు అనుమానం వస్తే వెంటనే ఇలా చేయాలని నిపుణులు చెబుతున్నారు

  • ఆ క్రమంలో మీ ఫోన్ నుంచి వాట్సాప్‌ అకౌంట్ తొలగించి హ్యాకర్‌కు యాక్సెస్‌ను నిలిపివేయాలి

  • తర్వాత మీ ఫోన్ నుంచి సిమ్ కార్డ్‌ను తీసివేసి హ్యాకర్‌కు ఫోన్ నంబర్ యాక్సెస్‌ లేకుండా చేయాలి

  • మీ ఫోన్‌ను Wi-Fi నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేసి, ఇంటర్నెట్ యాక్సెస్‌ను పొందాలి

  • మీ సిమ్ కార్డ్‌ను వేరే ఫోన్‌లో ఉపయోగించి వాట్సాప్ అకౌంట్ ఓపెన్ చేయండి

  • మీరు స్వీకరించిన కోడ్‌ను మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో నమోదు చేయండి

  • ధృవీకరణ కోడ్‌ను నమోదు చేసిన తర్వాత, మీ ఫోన్‌ను పునఃప్రారంభించండి.


దీంతోపాటు 2 Step Verification ఎనేబుల్ చేయండి

  • అందుకోసం WhatsApp > Settings > Account > Two-step verification > Enable

  • మీరు PIN సెటప్ చేసుకోవాలి. ఇది భవిష్యత్తులో హ్యాకింగ్ వంటి వాటని నిరోధించేందుకు బాగా ఉపయోగపడుతుంది

  • మళ్లీ access రాకపోతే, WhatsApp సపోర్ట్‌కు ఈ మెయిల్ పంపండి: support@whatsapp.com

  • మీ ఫోన్ నంబర్, సమస్య, స్క్రీన్‌షాట్ల వివరాలను యాడ్ చేయండి

  • మీరు హ్యాకింగ్ బాధితులైతే, పోలీసులు లేదా సైబర్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి ఫోన్ చేయండి. లేదంటే cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయవచ్చు

  • అంతేకాదు మీరు అకౌంట్‌ను కోల్పోయినట్టు మీ కాంటాక్ట్స్‌ వివరాలకు తెలియజేయండి. ఎవరికైనా మెసేజ్‌లు పంపించే డబ్బు అడిగితే ఎవరూ నమ్మకూడదని తెలపండి.


ఇవి కూడా చదవండి:

Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..


Bill Gates: వారానికి మూడు రోజేలే పని..బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..


iPhone like Design: రూ.6 వేలకే ఐఫోన్ లాంటి స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్లు తెలిస్తే షాక్ అవుతారు..


Monthly Income: 50 ఏళ్ల తర్వాత నెలకు రూ.లక్ష కావాలంటే ఎంత సేవ్ చేయాలి, ఎన్నేళ్లు చేయాలి

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 16 , 2025 | 04:44 PM