ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Donation: పెన్షన్‌పొదుపు చేసి..సైన్యానికి 10లక్షల విరాళం

ABN, Publish Date - May 29 , 2025 | 04:19 AM

ప్రభుత్వ ఉద్యోగి అయిన భర్త మరణం తర్వాత తనకు నెలనెలా అందుతున్న పెన్షన్‌ నుంచి పొదుపు చేసిన రూ.10 లక్షలను ఓ మహిళ భారత సైన్యానికి విరాళంగా ఇచ్చి పెద్ద మనసు చాటుకు న్నారు.

  • హైదరాబాద్‌ మహిళ సింగంసెట్టి అనురాధ పెద్దమనసు

అల్వాల్‌, మే 28 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగి అయిన భర్త మరణం తర్వాత తనకు నెలనెలా అందుతున్న పెన్షన్‌ నుంచి పొదుపు చేసిన రూ.10 లక్షలను ఓ మహిళ భారత సైన్యానికి విరాళంగా ఇచ్చి పెద్ద మనసు చాటుకు న్నారు. హైదరాబాద్‌, అల్వాల్‌కు చెందిన సింగంసెట్టి అనురాధ.. భర్త ప్రభుత్వ ఉద్యోగి. ఆయన కొన్నేళ్ల క్రితం మరణించారు. అనురాధ దంపతులకు ఉన్న ఇద్దరు కుమారులు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు.


వారిలో ఒకరు అమెరికాలో స్థిరపడగా, మరొకరు హైదరాబాద్‌లోనే ఉద్యోగం చేస్తున్నారు. పెన్షన్‌గా తనకు నెలనెలా అందే సొమ్ములో కొంత మొత్తాన్ని పొదుపు చేసిన అనురాధ..ఆ మొత్తం నుంచి రూ.10లక్షలను సైనిక సంక్షేమ నిధికి ఇచ్చారు. ఇందుకు సంబంధించిన డీడీ(డిమాండ్‌ డ్రాఫ్ట్‌)ని సికింద్రాబాద్‌లోని తెలంగాణ, ఆంధ్రాసబ్‌ ఏరియా కార్యాలయంలో బ్రిగేడియర్‌ నంజుడేశ్వర్‌, టాసా డిప్యూటీ జీవోసి బ్రిగేడియర్‌ రాజీవ్‌కు బుధవారం ఆమె స్వయంగా అందజేశారు.


Also Read:

వావ్.. రైలు పట్టాల మీద జేసీబీ

రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్

తెలంగాణ హైకోర్టు కొత్త సీజే ఎవరంటే

For More Telangana News and Telugu News..

Updated Date - May 30 , 2025 | 02:59 PM