ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Drug Control Raids: తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు..

ABN, Publish Date - May 27 , 2025 | 01:21 PM

Drug Control Raids: నిజామాబాద్‌లో నిషేధిత మత్తు పదార్థం ఆల్ఫాజోలం అమ్ముతున్న ముఠా గుట్టును యాంటీ నార్కోటిక్ డ్రగ్స్ బృందం రట్టు చేసింది. మహారాష్ట్ర కేంద్రంగా ఆల్ఫాజోలం తయారు చేసి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అమ్ముతున్న మూడు కంపెనీలను అధికారులు మూసివేశారు.

Drug Control Raids

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం (Telangana State)లో డ్రగ్ కంట్రోల్ (Drug Control) అధికారులు (Officers) మంగళవారం ఆకస్మిక తనిఖీలు (Surprise Inspections) చేపట్టారు. వరంగల్ (Waragal), అసిఫాబాద్ (Asifabad), నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో ఆర్ఎంపీ, మెడికల్ షాపులపై తనిఖీలు నిర్వహించారు. వరంగల్ గిర్మాజిపేటలో సాయికిరణ్ పౌల్ట్రీ, వెటర్నరీ మెడికల్ షాపుపై తనిఖీలు చేశారు. గుర్తింపు లేని, నకిలీ వెటర్నరీ మందులు పెద్ద మొత్తంలో స్టాక్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో రూ. 2.5 లక్షల విలువైన 26 రకాల వెటర్నరీ మందులు సీజ్ చేశారు. అసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో మెడికల్ షాపులో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. జ్వరానికి పని చేస్తుందని చెబుతూ అమ్ముతున్న నకిలీ ఆయుర్వేదిక్ మెడిసిన్ ప్లటోకోర్ టోటల్ సిరప్‌ను సీజ్ చేశారు.


ఆల్ఫాజోలం అమ్ముతున్న ముఠా గుట్టు రట్టు..

అలాగే నిజామాబాద్‌లో నిషేధిత మత్తు పదార్థం ఆల్ఫాజోలం అమ్ముతున్న ముఠా గుట్టును యాంటీ నార్కోటిక్ డ్రగ్స్ బృందం రట్టు చేసింది. మహారాష్ట్ర కేంద్రంగా ఆల్ఫాజోలం తయారు చేసి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అమ్ముతున్న మూడు కంపెనీలను అధికారులు మూసివేశారు. సుమారు రూ. 7 కోట్ల విలువ చేసే ఆస్తులను జప్తు చేశారు. దీనికి సంబంధించి నలుగురిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారయ్యారు. నార్కోటిక్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయితే ఆస్తులను సీజ్ చేస్తామని నిజామాబాద్ సీపీ సాయి చైతన్య వెల్లడించారు.

Also Read: పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు కీలక నేతలు..


కాగా డ్రగ్ కంట్రోల్ అధికారులు ఈనెల 21న రంగారెడ్డి, మహబూబాబాద్ జిల్లాల్లో మెడికల్ షాపులు, ఆర్ఎంపీ క్లినికులపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగుడా రావిరాలలో శ్రీ బాలాజీ క్లినిక్‌లో తనిఖీలు చేశారు. గుండ్లపల్లి నరసింహ క్లినిక్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. స్టెరైడ్స్‌తో పాటు 37 రకాల ఇతర మెడిసిన్ సీజ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ గ్రామంలో మహమ్మద్ మసూద్ అనే వ్యక్తి ఆర్ఎంపి క్లినిక్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. 39 రకాల యాంటీ బయోటిక్స్, స్టెరైడ్స్ ఇతర మెడిసిన్‌తో పాటు 17 రకాల శాంపిల్స్ సీజ్ చేశారు. మసూద్ క్లినిక్‌కు వస్తున్న రోగులకు ఫీషియన్ శాంపిల్స్ ఇస్తున్నట్లు గుర్తించారు. ఫీషియన్ శాంపిల్స్ మార్కెట్లో అమ్మవద్దని డీసీఏ సూచించింది. ఈ క్రమంలో రూ. 50వేల మెడిసిన్‌ను డ్రగ్ కంట్రోల్ అధికారులు సీజ్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అందుకే కేటీఆర్‌కు నోటీసులు

విశాఖ ఉక్కు కార్మికుల సమ్మె ఉధృతం..

For More AP News and Telugu News

Updated Date - May 27 , 2025 | 01:21 PM