ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Vishweshwar Reddy: బీబీపీ పార్టీల కుమ్మక్కు: విశ్వేశ్వర్‌రెడ్డి

ABN, Publish Date - Apr 21 , 2025 | 03:46 AM

హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక కోసం భాయ్‌ భాయ్‌కే పార్టీ(ఎంఐఎం), బాప్‌ బేటేకే పార్టీ (బీఆర్‌ఎస్‌), బేటా బేటీకే పార్టీ(కాంగ్రెస్‌)లు కుమ్మక్కయ్యాయని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి విమర్శించారు.

హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక కోసం భాయ్‌ భాయ్‌కే పార్టీ(ఎంఐఎం), బాప్‌ బేటేకే పార్టీ (బీఆర్‌ఎస్‌), బేటా బేటీకే పార్టీ(కాంగ్రెస్‌)లు కుమ్మక్కయ్యాయని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి విమర్శించారు. ఈ ఎన్నిక బీజేపీ వర్సెస్‌ బీబీపీ అని తెలిపారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విశ్వేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికలో ఎందుకు పోటీ చేయడం లేదని బీఆర్‌ఎ్‌సను నిలదీశారు. బారిస్టర్‌ చదివిన అసదుద్దీన్‌ ఒవైసీ, ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అన్నారు.


కేసీఆర్‌ వాడిన భాషనే ఒవైసీ మాట్లాడారని విమర్శించారు. ఉర్దూ భాషను సైతం కించపరిచేలా ఒవైసీ విమర్శలు చేశారన్నారు. వక్ఫ్‌ ఆస్తులను పరిరక్షించాలని ఒవైసీ అంటున్నారని.. వక్ఫ్‌ చట్ట సవరణ కూడా అందుకోసమే అని విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు.

Updated Date - Apr 21 , 2025 | 03:46 AM