ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Sunkara Ramachandra Rao: సీనియర్‌ జర్నలిస్టు సుంకర రామచంద్రరావు కన్నుమూత

ABN, Publish Date - Jul 24 , 2025 | 02:36 AM

సీనియర్‌ పాత్రికేయుడు, మనస్తత్వ శాస్త్ర రచనల అనువాదకుడు సుంకర రామచంద్రరావు (74) కన్నుమూశారు.

  • ఆంధ్రజ్యోతిలో సుదీర్ఘ కాలం పాత్రికేయుడిగా సేవలు

హైదరాబాద్‌ సిటీ, జూలై 23 (ఆంధ్రజ్యోతి): సీనియర్‌ పాత్రికేయుడు, మనస్తత్వ శాస్త్ర రచనల అనువాదకుడు సుంకర రామచంద్రరావు (74) కన్నుమూశారు. కొంతకాలం నుంచి మూత్ర పిండాల సమస్యతో బాధపడుతున్న ఆయన.. మంగళవారం తన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూనే కుప్పకూలిపోయారు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రామచంద్రరావు స్వస్థలం విజయవాడ. ఆయన తండ్రి సుంకర శివరామయ్య తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కొరియర్‌గా పనిచేశారు.

రామచంద్రరావు డిగ్రీ పూర్తిచేసిన అనంతరం ఆంధ్రభూమిలో పాత్రికేయ జీవితం ప్రారంభించారు. తర్వాత ఆంధ్రజ్యోతి సెంట్రల్‌ డెస్క్‌, అంతర్జాతీయ వార్తల అనువాద విభాగాల్లో సుదీర్ఘ కాలం పనిచేశారు. మంగళవారం సాయంత్రం జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో సుంకర రామచంద్రరావు అంత్యక్రియలు పూర్తి చేసినట్టు ఆయన కుమారుడు శివరామ్‌ తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..

దంచికొడుతున్న వాన.. భారీగా ట్రాఫిక్ జామ్

రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 24 , 2025 | 02:36 AM