Ramasikrishna Rao: 57 డిమాండ్లు పరిష్కరించండి
ABN, Publish Date - May 04 , 2025 | 04:31 AM
దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న 57ప్రభుత్వోద్యోగుల డిమాండ్లు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావుకు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీఓ) విజ్ఞప్తి చేసింది.
సీఎస్‌కు టీజీవో విజ్ఞప్తి
హైదరాబాద్, మే 3 (ఆంధ్రజ్యోతి): దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న 57ప్రభుత్వోద్యోగుల డిమాండ్లు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావుకు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీఓ) విజ్ఞప్తి చేసింది. సంఘం అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టీజీఓ ప్రతినిధులు శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతిపత్రం సమర్పించారు. సీఎ్‌సగా నియమితులైనందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తమ డిమాండ్లపై 16 నెలలుగా సీఎం, డిప్యూటీ సీఎంలను కలిసి విజ్ఞప్తి చేసినా ఒక్క అడుగూ ముందుకు పడలేదని ఆందోళన వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలు విడుదల చేసి, రూ.10వేలకోట్ల విలువైన బిల్లులు క్లియర్ చేయాలని కోరారు.
ఈ నెలలోనే సాధారణ బదిలీలు చేపట్టడంతోపాటు సమయానుకూలంగా శాఖాపరమైన పదోన్నతుల కమిటీలను ఏర్పాటుచేసి పదోన్నతులు కల్పించాలని అభ్యర్థించారు. సీపీసీని రద్దు చేసి, దాని స్థానే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. రెండో పీఆర్సీ నివేదిక పరిశీలించి.. ఉద్యోగులకు 51శాతం ఫిట్‌మెంట్‌తోపాటు అందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలని, 317 జీవోను సమీక్షించి సూపర్ న్యూమరీ పోస్టులను సృష్టించాలని కోరారు. సీఎస్ రామకృష్ణారావును కలిసిన వారిలో సంఘం ప్రధాన కార్యదర్శి ఎ.సత్యనారాయణ, సహ అధ్యక్షుడు బి.శ్యామ్, కోశాధికారి ఎం.ఉపేందర్‌రెడ్డి ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
ఈ తప్పులు చేయకుంటే హైదరాబాద్ జట్టు గెలిచేది..కానీ చివరకు
హైదరాబాద్ ఓటమి, గుజరాత్ ఘన విజయం
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 04 , 2025 | 04:31 AM