ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Mahesh Kumar Goud: సామాజిక విప్లవానికి నాంది

ABN, Publish Date - Jul 11 , 2025 | 04:19 AM

బీసీలకు 42శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ పేర్కొన్నారు.

బీసీలకు 42% రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు చరిత్రాత్మక నిర్ణయం

  • టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌

  • విప్లవాత్మక నిర్ణయం: కాంగ్రెస్‌ బీసీ నేతలు

హైదరాబాద్‌, జూలై 10 (ఆంధ్రజ్యోతి): బీసీలకు 42శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల అమలు కోసం ఆర్డినెన్స్‌ తీసుకురావాలని మంత్రివర్గం నిర్ణయించడం ‘సామాజిక విప్లవానికి నాంది’ అని అభివర్ణించారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్రలో చేసిన ‘జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు’ డిమాండ్‌ను దేశంలో తొలిసారిగా తెలంగాణలో అమలు చేస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న కాంగ్రె్‌సకు బీసీలు అండగా నిలవాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలు విప్లవాత్మక నిర్ణయమని కాంగ్రెస్‌ బీసీ నాయకులు అభివర్ణించారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల కాంగ్రెస్‌ ఎంపీలు అనిల్‌కుమార్‌ యాదవ్‌, సురేశ్‌ షెట్కార్‌, విప్‌లు ఆది శ్రీనివాస్‌, బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు శంకరయ్య, రాజ్‌ ఠాకూర్‌, ఓబీసీ సెల్‌ చైర్మన్‌ నూతి శ్రీకాంత్‌ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ పాలనలో 22 శాతానికి కుదించిన బీసీ రిజర్వేషన్లను 42శాతానికి పెంచడం గర్వకారణమని చెప్పారు. ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ తరఫున టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌ వ్యూహాత్మకంగా, సమన్వయంతో పనిచేయడం వల్లే ఈ విజయం సాధ్యమైందని పేర్కొన్నారు. కాగా.. బీసీలకు కాంగ్రెస్‌ ఇచ్చిన మాటకు కట్టుబడి స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలు నిర్ణయం తీసుకుందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్‌ చెప్పారు. ఇది బీసీలకు ప్రభుత్వం ఇచ్చిన గొప్పవరమని పేర్కొన్నారు.

అందరూ సహకరించాలి: బీసీ కమిషన్‌

బీసీలకు 42శాతం రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలకు వెళ్లాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు తెలంగాణ బీసీ కమిషన్‌ చైర్మన్‌ జి. నిరంజన్‌ చెప్పారు. ఈ రిజర్వేషన్లకు అడ్డంకులు లేకుండా, సజావుగా అమలయ్యేలా అన్ని వర్గాల వారు రాజకీయాలకు అతీతంగా సహకరించాలని కోరారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఆర్డినెన్స్‌ తెస్తామన్న ప్రభుత్వ నిర్ణయం పట్ల బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ అంశంలో ఎదురయ్యే చట్టపరమైన సమస్యలను అధిగమించడానికి ప్రభుత్వానికి అండగా ఉంటామని ప్రకటించారు.

రాష్ట్రవ్యాప్తంగా సంబరాలకు పిలుపు

స్థానిక ఎన్నికలలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలు కోసం తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ జిల్లాలు, నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు టీపీసీసీ పిలుపునిచ్చింది.

బీసీలు మళ్లీ మోసపోవద్దు బీసీ మేధావుల ఫోరం చైర్మన్‌ చిరంజీవులు

రాష్ట్రంలో బీసీలు మళ్లీ మోసపోవద్దని, రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్‌లో బీసీ రిజర్వేషన్లను చేర్చడమే అసలైన పరిష్కారమని బీసీ మేధావుల ఫోరం చైర్మన్‌ టి.చిరంజీవులు పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్‌ జారీ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆయన ఒక ప్రకటనలో స్పందించారు. గత ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్ల అమలు కోసం 2018లో జీఓ నం. 396 జారీ చేసిందని చిరంజీవులు గుర్తుచేశారు. కానీ మొత్తం రిజర్వేషన్లు 50శాతాన్ని మించొద్దంటూ ఆ జీవోను హైకోర్టు కొట్టివేసిందని, ఆ తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని చెప్పారు. దాంతో బీసీలకు 22శాతమే రిజర్వేషన్లు కల్పించారని.. ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా అదే ప్రయోగం చేస్తోందని విమర్శించారు.

ఈ వార్తలు కూడా చదవండి.

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్

గొంతు నొప్పిని తగ్గించే సింపుల్ చిట్కా..

ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి

Read Latest Telangana News and National News

Updated Date - Jul 11 , 2025 | 04:19 AM