ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pongulati: గ్రామ పటాలన్నీ ఇక డిజిటైజేషన్‌

ABN, Publish Date - May 20 , 2025 | 03:56 AM

గ్రామాల్లో ఇప్పటి వరకు కాగితాలకే పరిమితమైన సర్వే మ్యాప్‌లను (గ్రామ పటాలను) డిజిటలైజేషన్‌ చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. దశలవారీగా అన్ని గ్రామాల మ్యాప్‌లను డిజిటలైజ్‌ చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు.

  • ప్రయోగాత్మకంగా 3 గ్రామాల్లో ప్రారంభం

  • రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

హైదరాబాద్‌, మే19(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో ఇప్పటి వరకు కాగితాలకే పరిమితమైన సర్వే మ్యాప్‌లను (గ్రామ పటాలను) డిజిటలైజేషన్‌ చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. దశలవారీగా అన్ని గ్రామాల మ్యాప్‌లను డిజిటలైజ్‌ చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. సచివాలయంలో సోమవారం ఆయన రెవెన్యూ, సర్వే అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రిమోట్‌ సెన్సింగ్‌ అప్లికేషన్‌ సెంటర్‌ (టీజీఆర్‌ఏసీ) ద్వారా సర్వే పటాలను డిజిటలైజేషన్‌ చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని తొలుత ప్రయోగాత్మకంగా నాగర్‌ కర్నూల్‌ జిల్లా లింగాల, జగిత్యాల జిల్లా తక్కలపల్లి, ఖమ్మం జిల్లా పెద్దకోరుకొండి గ్రామాల్లో అమల్లోకి తెస్తున్నట్లు చెప్పారు. రెండు రోజుల్లో రికార్డుల డిజిటలైజేషన్‌ చేపట్టాలని అధికారులకు సూచించారు.


26 నుంచి లైసెన్స్‌డ్‌ సర్వేయర్లకు శిక్షణ

భూ భారతి చట్టంలో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు భూమి సర్వే మ్యాప్‌ను జత చేయడాన్ని తప్పనిసరి చేశామని, ఈ విధానాన్ని వీలైనంత త్వరగా అమల్లోకి తీసుకురావడానికి వీలుగా లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల నియామకాన్ని చేపడుతున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. సచివాలయంలో సోమవారం ఆయన లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల నియామకంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో తొలిదశలో 5000 మంది లైసెన్స్‌డ్‌ సర్వేయర్లను నియమిస్తున్నామని , ఇందు కోసం ఈ నెల 17 వరకు దరఖాస్తులు ఆహ్వానించగా 10,031 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 26 నుంచి గచ్చిబౌలిలోని సర్వే శిక్షణా సంస్థ (తాలిమ్‌)లో రెండు నెలల పాటు శిక్షణ ఉంటుందన్నారు.


ఇందిరమ్మ ఇళ్లకు రూ.16.07 కోట్లు విడుదల

ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా బేస్‌మెంట్‌ దశను పూర్తిచేసుకున్న 1,383 ఇళ్లకు, గోడలు పూర్తయిన 224 ఇళ్లకు కలిపి సోమవారం రూ.16.07 కోట్లను విడుదల చేశామని మంత్రి పొంగులేటి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 5,364 మంది బేస్‌మెంట్‌, గోడలు దశను పూర్తి చేసుకున్నారని, వారందరికి కలిపి రూ.53.64 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. సోమవారం ఆయన జూమ్‌ విధానంలో లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపు అంశంపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. పైలట్‌ ప్రాజెక్టు కింద 47,335 ఇళ్లను మంజూరు చేయగా.. ఇప్పటివరకు 20,104 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

HYD Fire Accident: ఓల్డ్‌సిటీ ఫైర్ యాక్సిడెంట్‌కి కారణం.. స్థానిక అక్రమ కరెంట్‌ కనెక్షన్లు.!

Gulzar House Fire Incident: గుల్జార్ హౌస్ ప్రమాదంపై ఎఫ్‌ఐఆర్ నమోదు

Hydra Demolitions: హైడ్రా కూల్చివేతలు షూరూ.. టెన్షన్ టెన్షన్

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 20 , 2025 | 03:56 AM