HYD Fire Accident: ఓల్డ్‌సిటీ ఫైర్ యాక్సిడెంట్‌కి కారణం.. స్థానిక అక్రమ కరెంట్ కనెక్షన్లు.!
ABN , Publish Date - May 19 , 2025 | 02:19 PM
జనాల్ని నిర్ఘాంతపోయేలా చేసిన హైదరాబాద్ పాతబస్తీలోని గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదం వెనక కారణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రమాదం జరిగిన ఇంటి చుట్టుపక్కలున్న స్థానికుల కరెంట్ చోర్యమే ప్రమాదానికి మూల కారణమని దర్యాప్తులో తెలియవస్తోంది.

ఇంటర్నెట్ డెస్క్: జనాల్ని నిర్ఘాంతపోయేలా చేసిన హైదరాబాద్ పాతబస్తీలోని గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదం వెనక కారణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రమాదం జరిగిన ఇంటి చుట్టుపక్కలున్న స్థానికుల కరెంట్ చోర్యమే ప్రమాదానికి మూల కారణమని దర్యాప్తులో తెలియవస్తోంది. ప్రమాదం జరిగిన బిల్డింగ్‌లోని నగల దుకాణం మూసివేయగానే హైటెన్షన్ వైర్ నుంచి.. కొక్కేల ద్వారా స్థానికులు కరెంట్ చోర్యం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ అక్రమ కరెంట్ వాడకంతో బాధిత కుటుంబ కరెంట్ మీటర్లపై లోడ్ బాగా పెరిగింది.
ఆ కరెంట్ లోడ్‌తో ప్రమాదం జరిగిన ఇంట్లోని కరెంట్ మీటర్ బాక్స్‌లో మంటలు చెలరేగినట్టు చెబుతున్నారు. అనంతరం మీటర్ బాక్స్ పక్కన ఉన్న ఉడెన్ షోకేజ్‌కు మంటలు అంటుకున్నాయని తెలుస్తోంది. ఉడెన్ షోకేజ్ నుంచి ఏసీ కంప్రెసర్‌ని మంటలు తాకి, ఆపై మంటలు భారీగా ఎగిసిపడి పెద్ద ప్రమాదానికి కారణమైనట్టు భావిస్తున్నారు. దీంతో స్థానికంగా చాలా కాలంగా జరుగుతున్న ఈ కరెంట్ దొంగతనాలపై పోలీసులు, ఫైర్ సిబ్బంది సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన ఇంటికి చేరుకున్న బాధిత కుటుంబ సభ్యుల నుంచి కూడా దర్యాప్తు బృందం వివరాలు సేకరిస్తోంది.
కాగా, ప్రమాదంపై (Gulzar House Fire Incident) విచారణ వేగంగా జరుగుతోంది. ఈ ప్రమాద ఘటనపై ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు అయ్యింది. మృతుల కుటుంబ సభ్యుడు ఉత్కర్ష్ మోదీ ఇచ్చిన ఫిర్యాదుతో చార్మినార్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఫిర్యాదులో నిన్న (ఆదివారం) ఏం జరిగిందో ఉత్కర్ష్ మోదీ పోలీసులకు వివరించారు. ఈ దుర్ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు, ఐదుగురు మహిళలు ఉన్నారు.
ప్రహ్లాద్ మోదీ తన కుటుంబసభ్యులతో కలిసి గత కొన్నేళ్లుగా గుల్జార్ హౌస్‌లో నివాసముంటున్నారు. నిన్న అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో 21 మంది కుటుంబసభ్యులు ఆ ఇంట్లో ఉన్నారు. అత్తాపూర్‌లో ఓ వేడుకకు హాజరై వచ్చిన వీరంతా ఇంట్లోనే నిద్రించారు. అయితే, తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఆ మంటలు అంతకంతకూ పెరగడంతో ఇంట్లో ఉన్న నాలుగు ఏసీ కంప్రెసర్లకు మంటలు అంటుకుని భారీ అగ్ని ప్రమాదానికి దారి తీసింది.
ఇవి కూడా చదవండి
Hydra Demolitions: హైడ్రా కూల్చివేతలు షూరూ.. టెన్షన్ టెన్షన్
Nandigam Suresh: నందిగం సురేష్‌కు ఎదురు దెబ్బ
Read Latest AP News And Telugu News