Revanth Reddy: నేటి నుంచి వనమహోత్సవం
ABN, Publish Date - Jul 07 , 2025 | 02:03 AM
ఆకుపచ్చని తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న వన మహోత్సవం సోమవారం ప్రారంభం కానుంది.
వ్యవసాయ వర్సిటీలో సీఎం శ్రీకారం
నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
రెండు రోజుల పాటు హస్తినలోనే.. కేంద్రమంత్రులను కలిసే అవకాశం
హైదరాబాద్/రాజేంద్రనగర్, జూలై 6(ఆంధ్రజ్యోతి): ఆకుపచ్చని తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న వన మహోత్సవం సోమవారం ప్రారంభం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమానికి రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శ్రీకారం చుట్టనున్నారు. అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, అటవీ దళాల ప్రధానాధికారి సువర్ణ, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏటా జూలై మొదటి వారంలో నిర్వహిస్తోంది. ఈ ఏడాది 18.02 కోట్ల మొక్కను నాటాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో అత్యధికంగా పంచాయతీరాజ్ శాఖ 7 కోట్లు, పురపాలక శాఖ 8 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం నిర్దేశించింది. అటవీ, వ్యవసాయ శాఖలు కూడా కోటి మొక్కలు నాటాలని ఆదేశించింది. గత ఏడాది 20 కోట్లు మొక్కలు నాటాలన్నది లక్ష్యం కాగా.. అందు లో 95ు మొక్కలు నాటారు. ఈ ఏడాది 100ు లక్ష్య సాధనకు కృషి చేయాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. వన మహోత్సవం కోసం 14,355 నర్సరీల్లో 20 కోట్ల మొక్కలు సిద్థం గా ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. .
అసత్య ప్రచారాన్ని నమ్మొద్దు: వీసీ
వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చెట్లను నరికివేస్తున్నారని సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని, దాన్ని ఎవరూ నమ్మవద్దని వైస్‌చాన్సలర్ ఆల్దాస్ జానయ్య కోరారు. వాతావరణానికి ముప్పు కలిగించే వర్సిటీ భూముల్లోని 3 వేల సుబాబుల్, 550 యూకలిప్టస్, సర్కారు తుమ్మ చెట్లను మాత్రమే తొలగిస్తున్నామని చెప్పారు.
Updated Date - Jul 07 , 2025 | 02:03 AM