Slot Booking: అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్
ABN, Publish Date - May 15 , 2025 | 03:25 AM
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోల స్లాట్ బుకింగ్ విధానాన్ని అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.
ఇప్పటికే 47 చోట్ల.. జూన్ నుంచి 97 కార్యాలయాల్లో..
ఇక దస్తావేజులపై ఆధార్-ఈ సంతకం
హైదరాబాద్, మే 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోల స్లాట్ బుకింగ్ విధానాన్ని అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా వాటిలో 47 కార్యాలయాల్లో ఇప్పటికే స్లాట్ బుకింగ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. మిగిలిన 97 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జూన్ నుంచి స్లాట్ బుకింగ్‌ను అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. రిజిస్ట్రేషన్ల రద్దీ అధికంగా ఉండే కార్యాలయాల్లో అవసరమైన అదనపు సిబ్బంది నియామకం, కార్యాలయాల విలీన ప్రక్రియ చేపట్టారు. స్లాట్ బుకింగ్‌కు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, కొత్త అప్లికేషన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఏప్రిల్ 10వ తేదీ నుంచి తొలిదశలో 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్‌ను అమల్లోకి తీసుకొచ్చిన ప్రభుత్వం.. మే 12వ తేదీ నుంచి మరో 25 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది.
సానుకూల ఫలితాలు వస్తున్నాయని, దస్తావేజుల రిజిస్ట్రేషన్‌కు వస్తున్న వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. లోటుపాటులను సరిదిద్ది దళారీ వ్యవస్థకు తావులేకుండా పూర్తిస్థాయిలో ఈ విధానాన్ని అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఇక దస్తావేజుల రిజిస్ట్రేషన్ సమయంలో సంతకాల కోసం ఎక్కువ సమయం పడుతోంది. ఈ వ్యవధిని తగ్గించడంతో పాటు సురక్షితమైన ధ్రువీకరణతో వ్యక్తి గుర్తింపును నిర్ధారించేలా ఆధార్-ఈ సంతకాన్ని అందుబాటులోకి తేనున్నారు. ఇప్పటికే ఆర్మూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ విధానం అమల్లో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా జూన్ నుంచి దీన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విధానంతో వ్యక్తుల ఆధార్ సంఖ్యను ఉపయోగించి దస్తావేజులపై ఎలకా్ట్రనిక్ పద్ధతిలో సంతకం చేసే వెసులుబాటు ఉంటుంది. ఇంటర్నెట్ సదుపాయం ఉన్న ప్రాంతాల్లో ఆధార్ సంఖ్యను నమోదు చేసిన మొబైల్ నంబరు ఉంటే ఎక్కడి నుంచైనా దస్తావేజులపై ఆధార్-ఈ సంతకం చేసే అవకాశం ఉంటుంది.
ఈ వార్తలు కూడా చదవండి
jagtyaala : పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి..
Crime News: తెలంగాణ భవన్ నుంచి సైబర్ నేరస్తుడు పరారీ..
TG News: ఢీకొన్న రెండు కార్లు.. ఆ తర్వాత ఏమైందంటే..
Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య
Read Latest Telangana News And Telugu News
Updated Date - May 15 , 2025 | 03:26 AM