ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Ponnam Prabhakar: డ్రగ్స్‌ రహిత తెలంగాణే లక్ష్యం

ABN, Publish Date - Jun 26 , 2025 | 03:31 AM

డ్రగ్స్‌ రహిత తెలంగాణే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ చెప్పారు.

  • అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేకదినం సందర్భంగా మంత్రి పొన్నం పిలుపు

  • వ్యసనాలకు యువత దూరంగా ఉండాలి:హీరో నిఖిల్‌

ఖైరతాబాద్‌, జూన్‌25(ఆంధ్రజ్యోతి): డ్రగ్స్‌ రహిత తెలంగాణే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ చెప్పారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా తెలంగాణ యాంటీ నార్కోటిక్‌ బ్యూరో ఆధ్వర్యంలో జలవిహార్‌ ఓపెన్‌ లాన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా జాగ్రత్త పడాలని సూచించారు. మంత్రి అడ్లూరి లక్షణ్‌ మాట్లాడుతూ యువత.. గంజాయి, డ్రగ్స్‌ల జోలికి పోరాదన్నారు.

సినీ హీరో నిఖిల్‌ మాట్లాడుతూ జీవితంలో ఏదైనా సాధించాలంటే వ్యసనాలకు దూరంగా ఉండాలని సలహా ఇచ్చారు. పోలీసు కమీషనర్‌ సీపీ ఆనంద్‌ మాట్లాడుతూ కోవిడ్‌ అనంతరం యువత మాదకద్రవ్యాలను అలవాటుగా చేసుకున్నారని, గ్రూపులుగా కూర్చొని సేవిస్తున్నారని వాపోయారు. డ్రగ్స్‌ ఫ్రీ తెలంగాణ కోసం ప్రభుత్వంతో పాటు పోలీస్‌ శాఖ కూడా తీవ్రంగా కృషి చేస్తోందన్నారు. ఈ సందర్భంగా యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో డైరక్టర్‌ సందీప్‌ శాండిల్య విద్యార్థులతో డ్రగ్స్‌ వాడబోమంటూ ప్రతిజ్ఞ చేయించారు.

Updated Date - Jun 26 , 2025 | 03:31 AM