ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Ganja Smuggling: పండ్ల ట్రేల కింద.. రూ.5 కోట్ల గంజాయి

ABN, Publish Date - Jul 29 , 2025 | 05:04 AM

ఒడిసా నుంచి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు గంజాయి స్మగ్లింగ్‌ చేసే ముఠా ఆటను తెలంగాణ మాదక ద్రవ్యాల నిరోధక విభాగం(ఈగల్‌) కట్టించింది.

  • ఒడిసా నుంచి.. ఏపీ, టీజీ మీదుగా మహారాష్ట్రకు సరుకు

  • ముఠా ఆటకట్టించిన ఈగల్‌ బృందం

హైదరాబాద్‌, జూలై 28 (ఆంధ్రజ్యోతి): ఒడిసా నుంచి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు గంజాయి స్మగ్లింగ్‌ చేసే ముఠా ఆటను తెలంగాణ మాదక ద్రవ్యాల నిరోధక విభాగం(ఈగల్‌) కట్టించింది. వ్యూహాత్మకంగా పండ్ల ట్రక్కులో తరలిస్తున్న 935 కిలోల గంజాయిని సీజ్‌ చేసింది. దీని విలువ రూ.5 కోట్లుగా ఉంటుంది. మహారాష్ట్రకు చెందిన పవార్‌కుమార్‌ బదు ఒడిసా నుంచి మహారాష్ట్రకు గంజాయిని తెప్పిస్తుంటాడు. ఇతను సచిన్‌ గంగారాం(పరారీలో ఉన్నాడు), ఒడిసాకు చెందిన విక్కీసేథ్‌తో కలిసి సరుకును తెప్పించేవాడు. రవాణాకు పవార్‌కుమార్‌, సమాధాన్‌ కాంతిలాల్‌బిసే, వినాయక్‌ బాబా సాహెబ్‌ పవార్‌ను వినియోగించేవాడు.

ట్రక్కులో పండ్ల ట్రేల కింద గంజాయిని దాచి, ఓ కారులో ఎస్కార్ట్‌తో ఈ ముఠా వస్తున్నట్లు ఖమ్మం ఆర్‌ఎన్‌సీసీ, రాచకొండ నార్కోటిక్స్‌ పోలీ్‌సస్టేషన్‌లోని ఈగల్‌ యూనిట్‌కు సమాచారం అందింది. ట్రక్కు, ఎస్కార్ట్‌ వాహనం వివరాలతో ఈగల్‌ బృందాలు హైదరాబాద్‌ శివార్లలో.. విజయవాడ జాతీయరహదారిపై బాటసింగారం పండ్ల మార్కెట్‌ కూడలి వద్ద శనివారం కాపుకాచాయి. ఈ క్రమంలో గంజాయిని తరలిస్తున్న ట్రక్కును గుర్తించాయి. పండ్ల ట్రేల కింద దాచిన 455 గంజాయి ప్యాకెట్లను సీజ్‌ చేశాయి. వాటిల్లో 935 కిలోల గంజాయి ఉంది. దీని విలువ.5 కోట్లుగా ఉంటుందని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి..

కాల్పుల విరమణలో అమెరికా పాత్ర లేదు, మోదీకి ఫోన్ కాల్ రాలేదు

22 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్ పూర్తి చేశాం: రాజ్‌నాథ్

For More National News and Telugu News..

Updated Date - Jul 29 , 2025 | 05:04 AM