గుజరాత్‌లో తెలంగాణ పోలీసుల ఆపరేషన్..
ABN, Publish Date - May 13 , 2025 | 03:56 AM
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(సీఎ్‌సబీ) పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి సూరత్‌లో 20మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశారు.
20మంది సైబర్ నేరగాళ్ల అరెస్టు
హైదరాబాద్, మే 12(ఆంధ్రజ్యోతి): తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(సీఎస్‌బీ) పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి సూరత్‌లో 20మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశారు. ఇందుకోసం పోలీసు బృందాలు పది రోజుల పాటు సూరత్‌లో మకాం వేయడం విశేషం. నిందితులపై తెలంగాణలో 60కి పైగా కేసులు నమోదు కాగా, దేశవ్యాప్తంగా వేర్వేరు రాష్ట్రాల్లో 515 సైబర్ కేసులు నమోదైనట్లు ప్రాథమిక విచారణలో తేలింది. వీరు రూ.4.37 కోట్ల అనుమానాస్పద లావాదేవీలు నిర్వహించినట్లు వెల్లడైంది.
నిందితుల్లో ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపారులతో పాటు ఓ బ్యాంకు ఉద్యోగి కూడా ఉన్నాడు. వారి నుంచి పోలీసులు 20 మొబైల్ ఫోన్లు, 28సిమ్ కార్డులు, 4 ఏటీఎం కార్డులు, 5 చెక్ బుక్‌లు, పాన్ కార్డులు, రబ్బరు స్టాంప్‌లు స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్‌లో పట్టుకున్న ఈ సైబర్ నేరగాళ్లను ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్‌కు తరలించామని సీఎ్‌సబీ డైరెక్టర్ షికా గోయల్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు..
భూ భారతి చట్టం రైతులకు రక్షణ కవచం..
For More AP News and Telugu News
Updated Date - May 13 , 2025 | 03:56 AM