ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Sudha Reddy: మిస్‌ వరల్డ్‌ గ్లోబల్‌ అంబాసిడర్‌ గౌరవాన్ని బాధ్యతగా భావిస్తా

ABN, Publish Date - Jun 01 , 2025 | 03:12 AM

మిస్‌ వరల్డ్‌ గ్లోబల్‌ అంబాసిడర్‌గా తన నియామకం పట్ల మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ డైరెక్టర్‌ సుధా రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు.

  • మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ డైరెక్టర్‌ సుధా రెడ్డి

బంజారాహిల్స్‌, మే 31(ఆంధ్రజ్యోతి): మిస్‌ వరల్డ్‌ గ్లోబల్‌ అంబాసిడర్‌గా తన నియామకం పట్ల మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ డైరెక్టర్‌ సుధా రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. బ్యూటీ విత్‌ పర్పస్‌ దాతృత్వ సంస్థకు ప్రతినిధిగా వ్యవహరించడంతో పాటు గ్లోబల్‌ అంబాసిడర్‌గా తనకు దక్కిన గౌరవాన్ని బాధ్యతగా భావిస్తానని ఆమె పేర్కొన్నారు. అలాగే, మిస్‌ వరల్డ్‌ 2025 గ్రాండ్‌ ఫినాలే అంతర్జాతీయ న్యాయ నిర్ణేతల కమిటీలో తనని సభ్యురాలిగా చేర్చడం గర్వంగా ఉందని తెలిపారు. తనను గ్లోబల్‌ అంబాసిడర్‌గా ప్రకటించినందుకు మిస్‌ వరల్డ్‌ సంస్థ చైర్‌పర్సన్‌, వ్యవస్థాపకురాలు జూలియో మోర్లీకి కృతజ్ఞతలు తెలియజేశారు.


మిస్‌ వరల్డ్‌ విజేతకు జూపల్లి శుభాకాంక్షలు

హైదరాబాద్‌, మే 31 (ఆంధ్రజ్యోతి): మిస్‌ వరల్డ్‌-2025 విజేత ఓపల్‌ సుచాతా చువాంగ్‌ శ్రీకి పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ పర్యాటకంపై ప్రచారం, సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించడమే లక్ష్యంగా నిర్వహించిన మిస్‌ వరల్డ్‌ పోటీలు విజయవంతం కావడంపై ఆయన హర్షంవ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి చొరవ, దిశానిర్దేశంతో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మిస్‌వరల్డ్‌ వేడుకలను తెలంగాణలో నిర్వహించడం గొప్ప విషయమన్నారు. ఈ ఈవెంట్‌ను ఎంతో గొప్పగా నిర్వహించిన ప్రతి ఒక్కరికీ జూపల్లి కృతజ్ఞతలు తెలియజేశారు.


ఇవి కూడా చదవండి

జగన్ ప్రభుత్వంలో రేషన్ సరుకుల అక్రమాలపై విచారణ చేశాం

ఆపరేషన్ సిందూర్‌పై కామెంట్లు.. లా స్టూడెంట్ అరెస్ట్..

Updated Date - Jun 01 , 2025 | 03:12 AM