ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bandi Ramakrishna Reddy: భాషావేత్త బండి రామకృష్ణారెడ్డి కన్నుమూత

ABN, Publish Date - Apr 25 , 2025 | 03:49 AM

ప్రముఖ భాషావేత్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత బండి రామకృష్ణారెడ్డి(83) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా వయసు రీత్యా తలెత్తే సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.

  • పలు యూనివర్సిటీల్లో ప్రొఫెసర్‌గా సేవలు

  • దేశ భాషల పరిరక్షణకుగాను పద్మశ్రీ గుర్తింపు

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ భాషావేత్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత బండి రామకృష్ణారెడ్డి(83) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా వయసు రీత్యా తలెత్తే సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. రామకృష్ణారెడ్డి కవి, కుయి, మండా భాషల పరిరక్షణకు అవిరళ కృషి చేశారు. ఇంది, ఆవే భాషలకు లిపి తయారు చేశారు. ఆయన స్వస్థలం చిత్తూరు జిల్లా రెంటాలచెను. శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎం.ఏ హిందీ, పుణే దక్కన్‌ కాలేజీలో భాషా శాస్త్రాన్ని అభ్యసించారు. ఎడిన్‌బర్గ్‌ విశ్వవిద్యాలయం నుంచి తెలుగు వాక్య నిర్మాణంలో స్థానిక అధ్యయనాలు అంశంపై పీహెచ్‌డీ చేశారు.


ఉస్మానియా విశ్వవిద్యాలయం భాషా శాస్త్ర విభాగంలో 1977 నుంచి 1990 వరకు ఆచార్యుడిగా సేవలందించారు. అనంతరం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం భాషాభివృద్ధి పీఠం అధిపతిగా, తర్వాత రిజిస్ట్రార్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. కుప్పం, ద్రవిడ విశ్వవిద్యాలయం వ్యవస్థాపక రిజిస్ట్రార్‌గానూ పనిచేశారు. అంతరించిపోతున్న భారతీయ భాషల పరిరక్షణకు రామకృష్ణారెడ్డి అందించిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2023లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. రామకృష్ణారెడ్డి అంత్యక్రియలు శుక్రవారం ఉదయం 11 గంటలకు తార్నాకలోని శ్మశానవాటికలో నిర్వహిస్తున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.


ఇవి కూడా చదవండి

Honeymoon Couple: హనీమూన్‌కు వెళ్లిన జంట.. కాల్పులకు ముందు ఏం చేశారంటే..

Nellore Police High Alert: నెల్లూరుపై ఉగ్రనీడలు.. పోలీసుల అలర్ట్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 25 , 2025 | 03:49 AM