Share News

Honeymoon Couple: హనీమూన్‌కు వెళ్లిన జంట.. కాల్పులకు ముందు ఏం చేశారంటే..

ABN , Publish Date - Apr 24 , 2025 | 09:59 AM

Honeymoon Couple: వివాహం జరిగిన జస్ట్ ఐదు రోజులే అయింది. రిసెపస్షన్ జరిగి కేవలం మూడు రోజులే అయింది. అనంతరం ఆ జంట హనీమూన్ కోసం జమ్మూ కశ్మీర్ వచ్చింది. అందులోభాగంగా మినీ స్విట్జర్లాండ్‌గా పిలిచే పహల్గాంకు చేరుకున్నారు. ఆ సమయంలో వారు ఆనందడోలికల్లో మునిగి తేలుతోన్నారు. అదే సమయంలో మృత్యువు రూపంలో ఉగ్రవాదులు అక్కడికి చేరుకున్నారు.

Honeymoon Couple: హనీమూన్‌కు వెళ్లిన జంట.. కాల్పులకు ముందు ఏం చేశారంటే..

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: జమ్మూ కాశ్మీర్‌ అనంత్ నాగ్ జిల్లాలో పహల్గాంలోని బైసరన్ మైదానంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించారు. ఆ మృతుల్లో వినయ్ నర్వాల్ కూడా ఉన్నారు. ఆయనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియలో వైరల్‌గా మారింది. ఈ కాల్పులకు ఘటనకు కొద్ది నిమిషాల ముందు వినయ్ నర్వాల్..తన భార్యతో కలిసి బాలీవుడ్ మూవీ సాంగ్‌తో డ్యాన్స్ చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

26 ఏళ్ల వినయ్ నర్వాల్..నేవిలో లెఫ్టినెంట్‌గా ప్రస్తుతం కేరళలోని కొచ్చిలో విధులు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 16వ తేదీన హిమాన్ష్‌తో వినయ్ నర్వల్ వివాహం జరిగగా.. ఏప్రిల్ 19వ తేదీన వారి వివాహ రిసెప్షన్ జరిగింది. అనంతరం హనీమూన్‌ కోసం తన భార్య హిమాన్షితో కలిసి ఆయన పహల్గాం చేరుకున్నారు. ఆ కొన్ని గంటలకే.. ఉగ్రవాదులు కాల్పులు జరపడం.. వినయ్ నర్వాల్ నేలకొరగడం వెంటవెంటనే జరిగిపోయాయి.


మరోవైపు బుధవారం మధ్యాహ్నం వినయ్ నర్వాల్ మృతదేహం కాశ్మీర్‌ నుంచి ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీ చేరుకుంది. అనంతరం హర్యానాలోని అతడి స్వస్థలం కర్నాల్‌కు తరలించారు. వినయ్ మృతదేహాన్ని కడసారి చూసేందుకు భారీగా జనం తరలి వచ్చారు. ఆ తర్వాత వినయ్ మృతదేహానికి మిలటరీ లాంఛనాలు అంత్యక్రియలు జరిగాయి.


అయితే వినయ్ నర్వాల్.. అతడికి అప్పగించిన పనులు నవ్వుతూ.. అంకిత భావంతో పని చేసేవారని నేవీ అధికారి గుర్తు చేసుకున్నారు. కొచ్చిలో లెఫ్టినెంట్‌గా బాధ్యతలు చేపట్టి ఏడాదిన్నర మాత్రమే అయిందని సదరు అధికారి తెలిపారు.


మరోవైపు పహల్గాంలోని బైసరన్‌లో తాను బేల్ పూరి తింటుండగా.. ఓ వ్యక్తి తుపాకీతో అక్కడి వచ్చాడు. మీది ఏ మతమని ప్రశ్నించాడు. సమాధానం చెప్పేలోపే సదరు వ్యక్తి తన భర్తపై తుపాకీతో కాల్పులు జరిపాడంటూ హిమాన్ష్ చెప్పిన వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

ఈ వార్తలు కూడా చదవండి..

Pahalgam Terror Attack: న్యూఢిల్లీలోని పాక్ దౌత్యవేత్తకు కేంద్రం పిలుపు

Pahalgam Terror Attack: పాక్‌పై కేంద్రం కీలక నిర్ణయం.. ఎంపీ సంచలన వ్యాఖ్యలు

For National news And Telugu News

Updated Date - Apr 24 , 2025 | 10:06 AM