Fee Reimbursement: త్వరలో ఫీజు రీయింబర్స్‌మెంట్
ABN, Publish Date - May 13 , 2025 | 04:52 AM
పెండింగులో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలంటూ ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాల సంఘం గత 40 రోజులుగా చేస్తున్న సమ్మెకు తెర పడింది.
వెంటనే విడుదల చేయాలని సీఎం ఆదేశించారు
తెలంగాణ ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు బాలకిస్టారెడ్డి
డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాల సమ్మె విరమణ
హైదరాబాద్, మే 12 (ఆంధ్రజ్యోతి) : పెండింగులో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలంటూ ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాల సంఘం గత 40 రోజులుగా చేస్తున్న సమ్మెకు తెర పడింది. బకాయిలు చెల్లించకుంటే త్వరలో జరగనున్న పరీక్షలను బహిష్కరిస్తామని యాజమాన్యాలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు ఆచార్య బాలకిస్టారెడ్డి సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. డిగ్రీ, పీజీ కళాశాలలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని, వెంటనే బకాయిలు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారని బాలకిస్టారెడ్డి తెలిపారు.
ఈ విషయాన్ని ఆయన సోమవారం తన కార్యాలయంలో కళాశాలల యాజమాన్యాల సంఘం సభ్యులతో నిర్వహించిన సమావేశంలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంతో సమ్మె విరమిస్తున్నామని సంఘం తెలిపింది. త్వరలో జరగనున్న అన్ని విశ్వవిద్యాలయాల పరీక్షల నిర్వహణకు పూర్తి సహకారం అందిస్తామని తెలంగాణ ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ రెడ్డి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు..
భూ భారతి చట్టం రైతులకు రక్షణ కవచం..
For More AP News and Telugu News
Updated Date - May 13 , 2025 | 04:52 AM