Home » Collages
ఫీజులు కట్టలేదని సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం, అడ్మిషన్ల సమయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకోవడం, ఫీజుల కోసం విద్యార్థులను ఒత్తిడి చేయడం తదితర ఘటనలపై ప్రభుత్వం సీరియస్ అయింది.
సీఎంఆర్ కళాశాల బాలికల వసతిగృహం ఘటనపై విచారణకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. కమిటీ ద్వారా వాస్తవాలను బయటకు తెచ్చేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.
ఈఏడాది వైద్యవిద్య పోస్టు గ్రాడ్యుయేట్ ప్రవేశాల ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. ఇప్పటికే అఖిల భారత కోటా రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ నడుస్తోంది. ఈ కోటాతో సమానంగా అన్ని రాష్ట్రాలు తమ కోటా కౌన్సెలింగ్ను జరుపుతున్నాయి.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడం విద్యార్థులకు శాపమైంది. ఫీజుల వసూలు అంశంలో మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి యంనంపేట్లో ఉన్న శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం కఠినంగా వ్యవహరించింది.
వైద్య విద్య కళాశాలల్లో ర్యాగింగ్ రోగం వికృతరూపం దాల్చుతోంది. తెలంగాణలోనూ ఇటీవల నాలుగైదు కాలేజీల్లో ర్యాగింగ్ భూతం జడలు విప్పింది. దేశవ్యాప్తంగా పలు కాలేజీల్లో దీనిపై పెద్దఎత్తున ఫిర్యాదులందినట్టు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) పేర్కొంది.
వైద్య విద్య పూర్తి చేసి ఇంటర్నీలుగా పనిచేస్తున్న వారితోపాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న మెడికోలకు సకాలంలో స్టైపెండ్ అందడంలేదని కొందరు విద్యార్థులు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ)కు ఫిర్యాదు చేశారు.
మేనేజ్మెంట్ కోటాలో పీజీ మెడికల్ సీట్లను బ్లాక్ చేసిన కేసులో చల్మెడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీలకు చెందిన రూ.5.34 కోట్ల మేరకు ఆస్తులను ఈడీ తాత్కాలికంగా అటాచ్ చేసింది.
రాష్ట్రంలోని 13 జిల్లాల్లో కొత్తగా 13 నర్సింగ్ కళాశాలలు మంజూరయ్యాయి. జనగాం, భూపాలపల్లి, కరీంనగర్, ఆసిఫాబాద్, నిర్మల్,
ఫీజు రీ-యింబర్స్మెంట్ పెండింగ్ బిల్లులకు నిరసనగా ఈనెల 19వ తేదీ నుంచి రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల బంద్ను నిర్వహిస్తున్నట్టు ప్రైవేట్ కాలేజీల అసోసియేషన్ అధ్యక్షుడు సూర్యనారాయణరెడ్డి ప్రకటించారు.
నల్లగొండలో వైద్య కళాశాలలో ర్యాగింగ్ భూతం కలకలం రేపింది. జూనియర్ వైద్య విద్యార్థులను ర్యాగింగ్ చేసినందుకు కళాశాలకు చెందిన ఓ జూనియర్ డాక్టర్ సహా ముగ్గురు వైద్య విద్యార్థులను సస్పెండ్ చేసినట్టు తెలిసింది.