Nara Lokesh: పెట్టుబడులపై వైసీపీ కుట్ర.. మంత్రి లోకేశ్ ఫైర్
ABN , Publish Date - Dec 19 , 2025 | 02:07 PM
ఐటీ పెట్టుబడులు, యువత ఉద్యోగాలపై జగన్ అండ్ కో కుట్ర చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. యువత భవిష్యత్‌పై ద్వేషంతోనే జగన్ ఈ పని చేస్తున్నారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.
రాజమండ్రి, డిసెంబరు18 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ(శుక్రవారం) రాజమండ్రిలో మంత్రి నారా లోకేశ్ పర్యటించారు. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో నూతన భవనాలను ప్రారంభించారు. అలాగే, కాలేజీలో విద్యార్థులతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. అనంతరం ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో నూతన భవనాలను ప్రారంభించారు.
జగన్ అండ్ కో కుట్ర చేస్తున్నారు..
ఈ సందర్భంగా ప్రసంగించారు మంత్రి నారా లోకేశ్. ఐటీ పెట్టుబడులు, యువత ఉద్యోగాలపై జగన్ అండ్ కో కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. యువత భవిష్యత్‌పై ద్వేషంతోనే జగన్ ఈ పని చేస్తున్నారా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇప్పటికే పలు ఐటీ సంస్థలపై వైసీపీ పిల్ వేసిందని ప్రస్తావించారు. ఇటీవల రహేజా ఐటీ పార్క్‌పైనా పిల్ వేశారని ఫైర్ అయ్యారు. ఐటీ ప్రాజెక్టులతో యువతకు లక్షకు పైగా ఉద్యోగాలు వస్తాయని స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా జగన్ పనిచేస్తున్నారని మండిపడ్డారు మంత్రి నారా లోకేశ్.
యువత భవిష్యత్‌పై జగన్‌కు ఇంత ద్వేషం ఎందుకు..? అని ప్రశ్నించారు. ఏపీకి వచ్చే పెట్టుబడులు, ఉద్యోగాలను అడ్డుకోవాలనే ఆలోచనా సబబా..? అని నిలదీశారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోకూడదని ధైర్యం చెప్పారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించే శక్తి దేవుడు ఇస్తారని తెలిపారు. తాను ఏ తప్పు చేసినా అమ్మ కొట్టేవారని గుర్తుచేశారు. ఇప్పటి పరిస్థితుల్లో ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే అమ్మ తిట్టినా మనం బాధపడకూడదని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.
విద్యార్థులతో మంత్రి నారా లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు పలు సమాధానాలు ఇచ్చారు.
విద్యార్థి హరివర్మ:
ప్రశ్న: డిగ్రీ పూర్తయిన తర్వాత ఉద్యోగం పొందే అవకాశం కల్పించాలి.
మంత్రి నారా లోకేశ్ సమాధానం: విద్యతో పరిశ్రమను అనుసంధానం చేయాలి. ఆక్వా రంగంలో ప్రపంచంలోనే నంబర్ వన్‌లో మనం ఉన్నాం. ఆక్వాను ప్రోత్సాహిస్తున్నామని వ్యాఖ్యానించారు.
విద్యార్థి శ్రీదేవి:
మహిళలను గౌరవించాలని పదేపదే చెబుతున్నారు కదా.. సోషల్ మీడియాలో, సినిమాల్లో మహిళలను అవమానపరుస్తున్నారు.
మంత్రి నారా లోకేశ్ సమాధానం:
నా తల్లిని కొంతమంది అవమాన పరిచారు. ఈ విషయంలో చాలా ఆవేదనకు గురయ్యాను. కేజీ నుంచి పీజీ వరకు మహిళలను గౌరవించాలనేది తాము లక్ష్యంగా నిర్ణయించుకున్నాం. నైతిక విలువలపై ఒక చట్టం తీసుకురావాలని ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.
విద్యార్థి సాత్విక:
డిగ్రీ చదువుకునేటప్పుడు పార్ట్ టైమ్ ఉద్యోగం చేసుకొనే అవకాశం కల్పిస్తారా..?
మంత్రి నారా లోకేశ్ సమాధానం:
నైపుణ్యం పోర్టల్‌లో కెరీర్ కౌన్సెలింగ్ ద్వారా విద్యార్థులకు అవకాశం కల్పిస్తామని వివరించారు.
విద్యార్థి కీర్తన:
మీకు పెద్దలు కుదిర్చిన వివాహం జరిగింది.. కదా మీ మధ్య ప్రేమ ఎలా ఉంటుంది..? .
మంత్రి నారా లోకేశ్ సమాధానం:
భార్యాభర్తల మధ్య అవగాహన ఉండాలి. పెద్దలను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు.
విద్యార్థి కిషోర్:
ఏపీలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. కదా ఏలా కల్పిస్తారు..?
మంత్రి నారా లోకేశ్ సమాధానం:
ప్రైవేట్, ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాం. గూగుల్ ద్వారా ఉద్యోగాలు కల్పిస్తాం. జనవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఆర్ పాటిల్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. కీలక అంశాలపై చర్చ
పోలీసుల కస్డడీకి కీలక మావోయిస్టులు..
Read Latest AP News And Telugu News