Hyderabad: మిస్ వరల్డ్ పోటీల ‘వీక్షణ’ పాస్‌లకు అపూర్వ స్పందన
ABN, Publish Date - May 09 , 2025 | 07:48 AM
హైదరాబాద్ నగరంలో జరగనున్న మిస్ వరల్డ్ పోటీలను తిలకించేందుకు జారీచేసే పాస్‌లకు అపూర్వ స్పందన లభిస్తోంది. ఈ పోటీలను తిలకించేందుకు ఇప్పటికే ఏకంగా 7వేల మందికి పైగా ఔత్సాహికులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
- తాత్కాలికంగా రిజిస్ట్రేషన్ల నిలిపివేత
హైదరాబాద్ సిటీ: నగరంలో జరుగనున్న 72వ మిస్ వరల్డ్(Miss World) పోటీలను తిలకించేందుకు ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ అర్హులేనంటూ తెలంగాణా పర్యాటక శాఖ మంత్రి, ముఖ్య కార్యదర్శి చేసిన ప్రకటనలకు నగరవాసుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. అతి సులభమైన ప్రశ్నలకు సమాధానం చెప్పడంతో పాటుగా తమ ఆధార్‌కార్డ్, చిరునామా ఇస్తే చాలని, ఈ పోటీలను తిలకించేందుకు పాస్‌లను జారీ చేస్తామని పర్యాటక శాఖ వెబ్‌సైట్(Website)లో వెల్లడించడంతో ఏకంగా 7వేల మందికి పైగా ఔత్సాహికులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Maoists: అడవిలో రక్తపుటేరులు
పాస్‌ల కోసం వస్తోన్న స్పందన, వేగంగా నగరవాసులు స్పందించిన తీరు చూసిన తరువాత ఇకపై రిజిస్ట్రేషన్‌లకు అనుమతించలేమని, తాత్కాలికంగా రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తున్నట్లు పర్యాటకశాఖ తమ వెబ్‌సైట్ (https://tourism.telangana.gov.-in/)లో వెల్లడించింది. ఇప్పటికే నమోదు చేసుకున్న వారిలో అర్హులైన వారికి ప్రారంభోత్సవ కార్యక్రమంతో పాటుగా మరికొన్ని కార్యక్రమాలను తిలకించే అవకాశం కల్పిస్తామని, మరో పది రోజుల తరువాతనే మరో మారు ఈ రిజిస్ట్రేషన్ విండో తెరుస్తామని వెల్లడించింది.
ఈ వార్తలు కూడా చదవండి
Breaking News: భారత్-పాక్ యుద్ధంపై చైనా తాజా రియాక్షన్ ఇదే..
ToDay Gold Rates: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..
మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజర్ చనిపోయాడా ..?
Operation Sindoor: యుద్ధ బీభత్సం
Read Latest Telangana News and National News
Updated Date - May 09 , 2025 | 07:48 AM