TG News: నిజామాబాద్‌లో లాకప్‌డెత్.. పోలీసులపై అనుమానాలు
ABN, Publish Date - Mar 14 , 2025 | 11:00 AM
Police Custody Death: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన ఘటన నిజామాబాద్‌లో జరిగింది. ఈ ఘటనపై మృతురాలి బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. పోలీసులపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు.
నిజామాబాద్:తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పోలీస్ కస్టడీలో ఉన్న యువకుడు నిన్న (గురవారం) రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు.పెద్దపల్లి జిల్లాకు చెందిన అలకుంట సంపత్‌ను ఇటీవల నిజామాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో మ్యాన్ పవర్ కన్సల్టెన్సీని సంపత్ నడుపుతున్నాడు. తన కన్సల్టెన్సీ ద్వారా దుబాయ్ పంపిస్తానని సంపత్ మోసం చేశాడని పలువురు యువకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకుల ఫిర్యాదు మేరకు సంపత్‌తో పాటు మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు.
విచారణ నిమిత్తం కోర్టు నుంచి రెండు రోజుల పాటు కస్టడీకి సంపత్‌ను పోలీసులు తీసుకున్నారు. నిన్న విచారణ నిమిత్తం జగిత్యాల జిల్లాకు సంపత్‌ను తీసుకుని పోలీసులు వెళ్లారు . తిరుగు ప్రయాణంలో అస్వస్థతకు సంపత్ గురయ్యాడు. వెంటనే నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి సంపత్‌ను పోలీసులు తరలించారు. చికిత్స పొందుతూ నిందితుడు సంపత్ మృతిచెందాడు. పోలీసులు కొట్టడంతోనే సంపత్ మృతి చెందాడని ఆస్పత్రి ఎదుట మృతుడి కుటుంబీకులు ధర్నా చేశారు. తమకు న్యాయం చేయాలని సంపత్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఈక్రమంలో ఆస్పత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దీంతో నిజామాబాద్ జిల్లాలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. యువకుడు సంపత్ మృతిచెందడంపై విచారణ జరిపించడానికి మేజిస్ట్రేట్ నిజామాబాద్ జిల్లా ప్రభుత్వాస్పత్రికి రానున్నట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
Trains: రైల్వే ప్రయాణికులకో గుడ్ న్యూస్.. అందేంటంటే..
Bandi Sanjay: 10 లక్షల ఎకరాల్లో పంటలు ఎండినా పట్టదా?
Raja Singh: ముఖ్యమంత్రితో బీజేపీ సీనియర్ నేతల రహస్య భేటీలు
Read Latest Telangana News and Telugu News
Updated Date - Mar 14 , 2025 | 11:14 AM