Share News

Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అందేంటంటే..

ABN , Publish Date - Mar 14 , 2025 | 06:57 AM

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడుస్తున్న 32 రైళ్లకు స్టాప్‌లను మరో ఆరునెలల పాటు కొనసాగించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. అలాగే.. హోలీ పండుగ నేపథ్యంలో పాట్నా-చర్లపల్లి మార్గంలో ప్రత్యేకరైళ్ల (44సర్వీసుల)ను నడపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అందేంటంటే..

  • 32 రైళ్లకు స్టాప్‌లు కొనసాగింపు..

హైదరాబాద్‌ సిటీ: దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) పరిధిలో నడుస్తున్న 32రైళ్లకు ప్రయోగాత్మక స్టాప్‌లను మరో ఆరునెలల పాటు కొనసాగించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ముఖ్యంగా సికింద్రాబాద్‌- తిరుపతి(Secunderabad-Tirupati) మధ్య నడిచే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‏కు మిర్యాలగూడలో, రేపల్లె-సికింద్రాబాద్‌ మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ కు సిరిపురంలో ఈ నెల 14నుంచి ప్రయోగాత్మక స్టాప్‌లు కొనసాగనున్నాయి.

ఈ వార్తను కూడా చదవండి: MLC Elections: ఐదుగురు ఎమ్మెల్సీలూ ఏకగ్రీవం!


అలాగే, లింగంపల్లి- విశాఖపట్నం మధ్య నడిచే జన్మభూమి ఎక్స్‌ప్రెస్‏కు, విజయవాడ-సికింద్రాబాద్‌(Vijayawada-Secunderabad) మధ్య నడిచే శాతవాహన ఎక్స్‌ప్రెస్‌, హైదరాబాద్‌-కాగజ్‌నగర్‌ మధ్య నడిచే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‏కు చర్లపల్లి స్టేషన్‌లో స్టాప్‌ కొనసాగుతుందని సీపీఆర్‌ఓ శ్రీధర్‌ తెలిపారు. నర్సాపూర్‌-నాగర్‌సోల్‌ ఎక్స్‌ప్రెస్‏కు మహబూబాబాద్‌లో, దానాపూర్‌-సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‏(Danapur-Secunderabad Express)కు జమ్మికుంటలో స్టాప్‌లు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్నెల్ల తర్వాత ఆయా రైళ్లకు ప్రయాణికుల నుంచి వస్తున్న ఆదరణను పరిశీలించి ప్రయోగాత్మక స్టాపేజీలను శాశ్వతంగా కొనసాగించే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

city1.2.jpg


పాట్నా-చర్లపల్లి మధ్య హోలీ ప్రత్యేక రైళ్లు

హోలీ పండుగ నేపథ్యంలో పాట్నా-చర్లపల్లి(Patna-Cherlapalli) మార్గంలో ప్రత్యేకరైళ్ల (44సర్వీసుల)ను నడపుతున్నట్లు దక్షిణ మఽధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల17నుంచి మే 28వరకు ప్రతి సోమ, బుధవారాల్లో మధ్యాహ్నం 3గంటలకు పాట్నా నుంచి చర్లపల్లికి (03253)ప్రత్యేకరైలును నడుపనున్నారు. 19వ తేదీ నుంచి మే 28 వరకు ప్రతి బుధవారం రాత్రి 22గంటలకు ప్రత్యేకరైలు (07255), ఈనెల 21నుంచి మే 30వరకు ప్రతి శుక్రవారం రాత్రి 9గంటలకు ప్రత్యేక రైలు (07256)ను చర్లపల్లి నుంచి పాట్నాకు నడుపనున్నట్లు సీపీఆర్‌ఓ శ్రీధర్‌ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

అమ్మో.. అప్పుడే 40 డిగ్రీలు

దేశ విభజనకు కాంగ్రెస్‌ కుట్ర

ఎండిన పంట.. రైతు గుండె మంట

జర్నలిస్టులుగా అసభ్య పదజాలం వాడొచ్చా..

Read Latest Telangana News and National News

Updated Date - Mar 14 , 2025 | 07:39 AM