ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Lucky Draw: ‘ఆంధ్రజ్యోతి లక్కీ డ్రా‘ కారు విజేతకు చెక్కు అందజేత

ABN, Publish Date - May 13 , 2025 | 05:24 AM

ఆంధ్రజ్యోతి పాఠకులకు కార్‌ అండ్‌ బైక్‌ రేసుకు సంబంధించి రాష్ట్రస్థాయి లక్కీడ్రాలో కారును గెలుచుకున్న ఏపీ లోని నెల్లూరు నగరవాసి జొన్నాదుల కోటేశ్వరరావుకు నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సోమవారం చెక్కు అందజేశారు.

  • సైకిల్‌ పక్కనపెట్టి కారులో వెళ్తా: విజేత

నెల్లూరురూరల్‌, మే12(ఆంధ్రజ్యోతి): ‘ఆంధ్రజ్యోతి’ పాఠకులకు కార్‌ అండ్‌ బైక్‌ రేసుకు సంబంధించి రాష్ట్రస్థాయి లక్కీడ్రాలో కారును గెలుచుకున్న ఏపీ లోని నెల్లూరు నగరవాసి జొన్నాదుల కోటేశ్వరరావుకు నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సోమవారం చెక్కు అందజేశారు. గత నెల 9న విజయవాడలో జరిగిన బంపర్‌డ్రాలో కోటేశ్వరరావును అదృష్టం వరించింది. రైల్వే శాఖలో పని చేస్తూ ఉద్యోగ విరమణ పొందిన ఆయన 20 ఏళ్లుగా ‘ఆంధ్రజ్యోతి’ పాఠకుడిగా ఉంటున్నారు. ‘కార్‌ అండ్‌ బైక్‌’ రేసులో రాష్ట్రస్థాయి విజేతగా నిలిచిన కోటేశ్వరరావు కారును గెలుచుకున్నారు. నెల్లూరులోని ఆంధ్రజ్యోతి యూనిట్‌ కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి పాల్గొని కోటేశ్వరరావుకు కారుకు సంబంధించి నగదు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ‘ఆంధ్రజ్యోతి’ నాడు, నేడు ప్రజల పక్షాన నిలిచే నిజాయితీ గల సంస్థ అని కొనియాడారు. అధికార పక్షమా, ప్రతిపక్షమా అన్న తేడా లేకుండా ఎవరు తప్పులు చేసినా విమర్శించగల పాత్రికేయ లక్షణం ఈ యాజమాన్యం సొంతమని తెలిపారు. సమాజం పట్ల కూడా తన బాధ్యతను గుర్తెరిగి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. కారును గెలుచుకున్న కోటేశ్వరరావును అభినందించారు.


‘ఆంధ్రజ్యోతి’ రోజూ చదువుతా: కోటేశ్వరరావు

‘కొన్నేళ్లగా నేను ‘ఆంధ్రజ్యోతి’ చదువుతున్నా. ఈ పత్రిక చదవకపోతే సమాజంలో ఏం జరుగుతోందో వాస్తవాలు తెలియవు. ‘ఆంధ్రజ్యోతి’లో నిజాయితీతో కూడిన వార్తలుంటాయి. రైల్వే ఉద్యోగిగా ఉన్న రోజు ల్లో ఎక్కడున్నా ఈ పత్రికను చదివేవాడిని. నా జీవి తం ఇప్పటి వరకు సైకిల్‌తో సాగింది. ఇక నుంచి సైకిల్‌ను పక్కన పెట్టేసి ‘ఆంధ్రజ్యోతి’ ఇచ్చిన కారులో నేను, నా కుటుంబం వెళ్తాం. ఈసంతోషం మరువరానిది’ అంటూ కోటేశ్వరరావు ఆనందం వ్యక్తం చేశారు.

Updated Date - May 13 , 2025 | 05:24 AM