ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

NEET UG 2025: నీట్‌-యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

ABN, Publish Date - Jul 13 , 2025 | 04:26 AM

వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించిన నీట్‌-యూజీ 2025 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది. ఈ మేరకు శనివారం మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ (ఎంసీసీ) అధికారికంగా ఆలిండియా కోటా, రాష్ట్రస్థాయి కౌన్సెలింగ్‌ తేదీలను విడుదల చేసింది.

  • 21 నుంచి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభం

  • తొలుత ఆల్‌ ఇండియా కోటా

  • రాష్ట్రంలో 30 నుంచి కౌన్సెలింగ్‌ షురూ

  • తెలంగాణలో 8,690 ఎంబీబీఎస్‌ సీట్లు

హైదరాబాద్‌, జూలై 12 (ఆంధ్రజ్యోతి): వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించిన నీట్‌-యూజీ 2025 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది. ఈ మేరకు శనివారం మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ (ఎంసీసీ) అధికారికంగా ఆలిండియా కోటా, రాష్ట్రస్థాయి కౌన్సెలింగ్‌ తేదీలను విడుదల చేసింది. నీట్‌ 2025లో అర్హత సాధించిన వారు కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. తొలుత అఖిల భారత కోటాకు కౌన్సెలింగ్‌ జరగనుంది. అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా రిజిస్ర్టేషన్‌, ఆప్షన్ల ఎంపిక తర్వాత సీటు అలాట్‌మెంట్‌ జరిగాక ఫిజికల్‌గా రిపోర్టు చేయాలని ఎంసీసీ వెబ్‌సైట్‌లో పేర్కొంది. జూలై 21 నుంచి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొంది. గ ఇక తెలంగాణలో ఈ నెల 30 నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమై అక్టోబరు 3నాటికి ముగియనుంది.

ఇందుకు సంబంధించి ఆరోగ్య విశ్వవిద్యాలయం త్వరలోనే కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. తెలంగాణలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 4,090 ఎంబీబీఎస్‌ సీట్లుండగా, ప్రైవేటులో 4,600 సీట్లున్నాయి. ఇక సెప్టెంబరు 1 నుంచి ఎంబీబీఎస్‌ తరగతులు ప్రారంభమవుతాయని ఎంసీసీ పేర్కొంది. కాగా దేశంలోని అన్ని ప్రభుత్వ కళాశాలల్లోని సీట్ల్లలో 15 శాతం ఆలిండియా కోటాకు వెళ్తాయి. వాటికి తొలుత కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. ఈ కోటా కౌన్సెలింగ్‌లోనే దేశంలోన్ని అన్ని ఎయిమ్స్‌, డీమ్డ్‌ వర్సిటీలు, సెంట్రల్‌ యూనివర్సిటీలు, జిప్‌మర్‌లో ఉన్న యూజీ సీట్లను భర్తీ చేస్తారు. మొత్తం నాలుగు రౌండ్ల కౌన్సెలింగ్‌ ఉంటుంది. మూడు విడతల కౌన్సెలింగ్‌ నిర్వహించిన తర్వాత ఇంకా విద్యార్థులు చేరకుండా మిగిలిపోయిన సీట్లను నాల్గో విడత (స్ట్రే వెకెన్సీ) ద్వారా భర్తీ చేస్తారు.

నీట్‌-యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌-2025 ఇలా..

ప్రవేశ షెడ్యూల్‌ ఆలిండియా, వెరిఫికేషన్‌ తేదీ స్టేట్‌ కౌన్సెలింగ్‌ వెరిఫికేషన్‌ తేదీ

డీమ్డ్‌ యూనివర్సిటీలు

మొదటి రౌండ్‌ కౌన్సెలింగ్‌ జూలై 21 - 30 ఆగస్టు 7-8 జూలై 30-ఆగస్టు6 ఆగస్టు 13-14

చేరేందుకు చివరి తేదీ ఆగస్టు 6 ----- ఆగస్టు 12 -----

రెండో రౌండ్‌ కౌన్సెలింగ్‌ ఆగస్టు 12-20 ఆగస్టు 30-సెప్టెంబరు1 ఆగస్టు 19-29 సెప్టెంబరు 5-6

చేరేందుకు చివరి తేదీ ఆగస్టు 29 ---- సెప్టెంబరు 4 -----

మూడో రౌండ్‌ సెప్టెంబరు 3-10 సెప్టెంబరు 19-21 సెప్టెంబరు 9-18 సెప్టెంబరు 24

చేరేందుకు చివరి తేదీ సెప్టెంబరు 18 ----- సెప్టెంబరు 23 -----

స్ట్రే వెకెన్సీ సెప్టెంబరు 22-26 ----- సెప్టెంబరు 25-29 ------

చేరేందుకు చివరి తేదీ అక్టోబరు 3 --------- అక్టోబరు 3 ------

ఇవి కూడా చదవండి..

విమాన ప్రమాదం.. నివేదికలో బయటపడ్డ సంచలన విషయాలు

కుర్చీ దొరికితే వదలొద్దు.. డీకే ఆసక్తికర వ్యాఖ్యలు

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 13 , 2025 | 04:26 AM