Yadagirigutta: ఆహ్లాదం... ఆధ్యాత్మికం.. మినీ శిల్పారామం
ABN, Publish Date - Jun 03 , 2025 | 05:33 AM
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునే భక్తులు ఆహ్లాదకరంగా గడిపేందుకు మినీ శిల్పారామాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.
యాదగిరిగుట్ట సమీపంలో ప్రారంభం
చెరువులో బోటింగ్ సదుపాయం
యాదాద్రి, జూన్ 2(ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునే భక్తులు ఆహ్లాదకరంగా గడిపేందుకు మినీ శిల్పారామాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. యాదగిరిగుట్ట సమీపంలోని రాయగిరి చెరువు అలుగుపోసే ప్రాంతంలో నిర్మించిన శిల్పారామాన్ని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం రాయగిరి చెరువులో బోటింగ్ చేశారు. రూ.2కోట్ల వ్యయంతో రెండు ఎకరాల్లో మినీ శిల్పారామాన్ని ప్రభుత్వం ఆకట్టుకునేలా నిర్మించింది. 1.20ఎకరాల్లో పలు అభివృద్ధి పనులు, మిగతా ప్రదేశాల్లో గ్రీనరీ ఏర్పాటుచేశారు.
పిల్లలు ఆడుకునేందుకు, పెద్దలు సేదతీరేందుకు మైదానాన్ని సిద్ధం చేశారు. విభిన్న రుచులు అందించేందుకు ఫుడ్‌కోర్టును ఏర్పాటు చేశారు. పచ్చదనం, పార్కులు, చిన్నపిల్లల ఆటల ప్రాంగణం, చెరువులో ఫౌంటెయిన్, పర్యాటకులు సేదతీరేలా చిన్న కుటీరాలు, చెరువులో జలవిహారానికి బోటింగ్ సదుపాయం కల్పించారు. శిల్పకళ, హస్తకళా వైభవంతో రాత్రివేళ పరిసరాలన్నీ జిగేల్‌మనేలా తీర్చిదిద్దారు.
ఈ వార్తలు కూడా చదవండి
బేకరీలో దారుణం.. అందురూ చూస్తుండగానే..
చుండ్రు సమస్యకు సింపుల్ చిట్కాలు..
Read Latest Telangana News And Telugu News
Updated Date - Jun 03 , 2025 | 05:33 AM