Home » Yadadri Bhuvanagiri
పోలియోతో కాళ్లు చచ్చిబడిపోయిన స్థితిలో భక్తులు తోచినంత ఇస్తే యాచకురాలిగా పొట్టపోసుకుంటూ.. వచ్చిన ఆ డబ్బులో సింహభాగాన్ని స్వామివారి పూజలకే వెచ్చిస్తున్న ఓ మహిళ చివరికి స్వామివారి సన్నిధిలోనే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచింది.
వరుస సెలవుల కారణంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు.
కాంగ్రెస్‌లో బయట నుంచి వచ్చిన నాయకుల పెత్తనం ఎక్కువైందని మాత్రమే తాను చెప్పానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో భక్తులు సమర్పించే విరాళాలు, కానుకల నిర్వహణలో పూర్తి పారదర్శకత తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. భక్తులు ఆలయాలకు సమర్పించే ప్రతి పైసా ఆలయ ఖజానాకు చేరేలా తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నమూనాలో ఓ సమగ్ర ‘డోనర్ పాలసీ’ రూపొందించేందుకు దేవాదాయశాఖ కసరత్తు చేస్తోంది.
మాజీ సీఎం కేసీఆర్‌పై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆలేరు, భువనగిరి ప్రజల పాపం తగిలే కేసీఆర్ కాలు విరిగి ఫాంహౌస్ పాలయ్యారని విమర్శించారు.
చరిత్ర కలిగిన పురాతన భువనగిరి ఖిల్లాకు పూర్వవైభవం తీసుకొస్తామని టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. భువనగిరి ఖిల్లా పైకి రోప్ వే నిర్మించే స్థలాన్ని మంత్రి జూపల్లి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పరిశీలించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి శనివారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలో విస్తృతంగా పర్యటించారు. తన పర్యటన సందర్భంగా జరిగిన అధికారుల సమన్వయలోపంపై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. రూ.100 కోట్లతో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం నాడు యాదగిరిగుట్టలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వేద పాఠశాలకు భూమిపూజ చేయనున్నారు.
తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ ఈరోజు(ఆదివారం) అధికంగా ఉంది. వారాంతం కావడం, ప్రత్యేక పూజలు, మొక్కులు తీర్చుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు.