Yadadri Bhongir Road Accident: యాదాద్రి రామన్నపేటలో కంటైనర్ బీభత్సం
ABN , Publish Date - Oct 09 , 2025 | 08:11 AM
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రామన్నపేటలోని సుభాష్ చౌరస్తా వద్ద వాహన తనిఖీలు జరుగుతుండగా కంటైనర్ లారీ అదుపు తప్పి..
యాదాద్రి భువనగిరి జిల్లా: రామన్నపేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రామన్నపేటలోని సుభాష్ చౌరస్తా వద్ద వాహన తనిఖీలు జరుగుతుండగా కంటైనర్ లారీ అదుపు తప్పి భయంకరమైన ఘటనకు దారితీసింది. తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో వాహనాలను తనిఖీ చేస్తున్న హోంగార్డు ఉపేందర్‌ను కంటైనర్ ఢీకొట్టి పైనుండి వెళ్లిపోయింది.
ఈ ప్రమాదంలో రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందిన ఉపేందర్ అక్కడికక్కడే మృతిచెందాడు.ప్రమాదం తర్వాత డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడని తెలుస్తోంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటనతో రామన్నపేట ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. సహచరులు, స్థానికులు ఉపేందర్ మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
Also Read:
ఉదయం నిద్ర లేవగానే వేడి టీ తాగే అలవాటు ఉందా?
పసిడికి పగ్గాల్లేవ్.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
For More Latest News