Share News

Heavy Rains ON Musi River Flood: అలర్ట్.. ఉధృతంగా మూసీ ప్రవాహం.. నిలిచిన రాకపోకలు

ABN , Publish Date - Sep 28 , 2025 | 10:32 AM

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానలు దంచికొడుతోండటంతో చెరువులు, వాగులకు వరద నీరు భారీగా చేరుకుంది. అయితే, యాదాద్రి జిల్లాలో ఉధృతంగా మూసీ ప్రవహిస్తోంది. జూలూరు - రుద్రవల్లి బ్రిడ్జిపై నుంచి మూసీ వరద ఉధృతి పొటెత్తింది.

Heavy Rains ON Musi River Flood: అలర్ట్.. ఉధృతంగా మూసీ ప్రవాహం.. నిలిచిన రాకపోకలు
Heavy Rains ON Musi River Flood

హైదరాబాద్, యాదాద్రి, సెప్టెంబరు28 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో భారీ వర్షాలు (Telangana Heavy Rains) కురుస్తున్నాయి. వానలు దంచికొడుతుండటంతో చెరువులు, వాగులకు వరద నీరు భారీగా చేరుకుంది. అయితే, యాదాద్రి జిల్లాలో ఉధృతంగా మూసీ నది (Musi River) ప్రవహిస్తోంది. జూలూరు - రుద్రవల్లి బ్రిడ్జిపై నుంచి మూసీ వరద ఉధృతి పొటెత్తింది. మూసీ ఉధృతితో పోచంపల్లి -బీబీనగర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వలిగొండ మండలం సంగెం - భీమలింగం కత్వ వద్ద పై నుంచి మూసీ వరద ప్రవహిస్తోంది. దీంతో చౌటుప్పల్ - భువనగిరి మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బారీకేడ్లను పోలీసులు ఏర్పాటు చేశారు.


దెబ్బతిన మూసారాంబాగ్ రోడ్డు

అయితే, భారీ వర్షంతో వచ్చిన వరదకు దెబ్బతింది మూసారాంబాగ్ రోడ్డు. దీంతో ఈ ప్రాంతంలో రాకపోకలు పూర్తిగా ఆపేశారు అధికారులు. ఇటీవల కురిసిన వర్షానికి భారీగా వరద చేరుకోవడంతో మూసారాంబాగ్ బ్రిడ్జిపై తాత్కాలికంగా ఉన్న సర్వీసు రోడ్డు పూర్తిగా దెబ్బతింది. రోడ్డు పెచ్చులు ఊడిపోయింది. రోడ్డుపై చెత్తాచెదారం పేరుకుపోయింది. ఈ రోడ్డుపై వాహనాల రాకపోకలు సాగించడం కష్టంగా మారింది.


మూసారాంబాగ్ బ్రిడ్జి ఫ్లై ఓవర్ నిర్మాణం చేస్తోండటంతో.. ఓ పక్కగుండా ఉన్న రోడ్డుపై తాత్కాలిక రాకపోకలకు అధికారులు అనుమతించారు. అయితే ఆ రోడ్డు కూడా వర్షపు నీటికి పూర్తిగా దెబ్బతినడంతో మూసివేశారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యే వరకు ఈ మార్గంలో రాకపోకలు సాగించవద్దని అధికారులు కోరుతున్నారు. ఈ విషయంపై అంబర్‌పేట సర్కిల్ డీఎంసీ మారుతి దివాకర్, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వీర కౌశిక్‌లు ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు. బ్రిడ్జికి ఇరువైపులా పోలీసులు బారీకేడ్‌లను ఏర్పాటు చేసి రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ప్రజలు ఈ మార్గంలోకి రాకుండా బ్రిడ్జికి ఇరువైపులా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.


హైదరాబాద్‌లో శాంతించిన మూసీ నది..

మరోవైపు.. హైదరాబాద్ నగరంలో శాంతించింది మూసీ నది. మూసీ వరద తీవ్రత తగ్గింది. ఉస్మాన్ సాగర్‌, హిమాయత్ సాగర్‌ జంట జలాశయాల నుంచి అవుట్ ఫ్లో తగ్గుతోంది. ఎగువ నుంచి మూసీకి వస్తున్న ఇన్ ఫ్లో తగ్గడంతో.. అవుట్ ఫ్లో తగ్గింది. ఈ మేరకు జలమండలి అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ఉస్మాన్ సాగర్‌కి ఇన్ ఫ్లో - 1,100 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో - 884 క్యూసెక్కుల వరద నీటిని మూసీలోకి విడుదల చేశారు. హిమాయత్ సాగర్‌కి 4వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో చేరుకుంది. 3,851 క్యూసెక్కుల అవుట్ ఫ్లో మూసీలోకి వదిలారు. అయితేే, మూసీ ఉగ్రరూపంతో ఆందోళనకు గురవుతున్నారు మూసీ పరివాహక వాహక ప్రాంతవాసులు.


ఈ వార్తలు కూడా చదవండి..

నేడు బతుకమ్మ కుంటను ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి

ఓటు చోరీపై మహేష్ గౌడ్ సంచలన ఆరోపణలు

Read Latest Telangana News and National News

Updated Date - Sep 28 , 2025 | 10:38 AM