Share News

CM Revanth Reddy ON Bathukamma Kunta: నేడు బతుకమ్మ కుంటను ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి

ABN , Publish Date - Sep 28 , 2025 | 09:04 AM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అంబర్‌పేట్‌లో ఇవాళ(ఆదివారం) పర్యటించనున్నారు. బతుకమ్మ కుంట ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.

CM Revanth Reddy ON Bathukamma Kunta: నేడు బతుకమ్మ కుంటను ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి
CM Revanth Reddy ON Bathukamma Kunta:

హైదరాబాద్, సెప్టెంబరు28 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఇవాళ(ఆదివారం) అంబర్‌పేట్‌లో పర్యటించనున్నారు. బతుకమ్మ కుంట (Bathukamma Kunta) ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. భారీ వర్షం కారణంగా గత రెండు రోజుల క్రితమే ప్రారంభోత్సవం కావలసిన బతుకమ్మ కుంట వాయిదా పడింది.


ఇవాళ సాయంత్రం 6 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా బతుకమ్మ కుంట ప్రారంభం కానుంది. ఐదు ఎకరాల 15 గుంటల స్థలంలో ఉన్న బతుకమ్మ కుంటకు పునరుజ్జీవం పోసింది హైడ్రా. రూ.7 కోట్ల 40 లక్షలతో సుందరీకరణ చేస్తున్నామని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వెల్లడించింది. బతుకమ్మ కుంటలో చిల్డ్రన్ ప్లే ఏరియా, ఓపెన్ జిమ్, చుట్టూ వాక్ వే ఏర్పాటు చేశారు.


భారత్ ఫ్యూచర్ సిటీ ప్రారంభోత్సవంలో పాల్గొనున్న సీఎం రేవంత్‌రెడ్డి..

అలాగే, భారత్ ఫ్యూచర్ సిటీ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి ఈరోజు పాల్గొననున్నారు. FCDA భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలో FCDA భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. వీటితో పాటు రావిర్యాల నుంచి అమన్‌గల్ వరకు నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్-1 నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి

ఓటు చోరీపై మహేష్ గౌడ్ సంచలన ఆరోపణలు

Read Latest Telangana News and National News

Updated Date - Sep 28 , 2025 | 09:15 AM